Rajamouli’s Key Point: రాజమౌళి చెప్పిన ఓ మంచి పాయింట్…

Rajamouli’s Key Point: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు మూస ధోరణిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. కానీ కొందరు మాత్రం టెక్నాలజీని వాడుకొని మంచి సినిమాలను చేస్తూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతం రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్యమైన కథాంశం అయితే ఉంటుంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలను సైతం ఆయన పాన్ ఇండియా ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాడు అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ లో మహేష్ బాబుతో ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సక్సెస్ లను సాధించినా కూడా రాజమౌళి అందుకున్న విజయాలను మాత్రం సాధించలేకపోతున్నాడు…ఇక ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి సినిమాలను థియేటర్లో చూడడం బెటరా? ఓటిటి లో చూడటం మంచిదా అనే ధోరణిలో కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయం మీద ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తుంటే మొదటిసారి రాజమౌళిని సినిమాలను ఎక్కడ చూస్తే ప్రేక్షకుడిలో ఇంపాక్ట్ ఉంటుంది. సినిమాను ప్రేక్షకుడి పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయగలుగుతాడు అనే విషయం మీద ఒక ప్రశ్న అడగగా..దానికి రాజమౌళి సమాధానం చెబుతూ ఒక సినిమాను థియేటర్లో కొంతమందితో కలిసి కూర్చొని చూసినప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాం…అందులో ఒక ఎలివేషన్ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులందరు అరుస్తూ ఉంటారు.

దానికి ప్రతి ఒక్కరు ఒక భావోద్వేగానికి లోనై సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమాని చూస్తూ ఉంటారు. ఈలలు కేకల మధ్య సినిమాని చూసినప్పుడు పొందే అనుభూతి ఓటిటిలో సినిమాను చూస్తూ ఇంట్లో ఇద్దరు, ముగ్గురు కూర్చుని డోర్లు వేసుకొని చూసినంత మాత్రాన ఆ ఇంపాక్ట్ అయితే రాదని, థియేటర్లో సినిమాను చూడడమే ఉత్తమమని చెబుతున్నాడు.

నిజానికి రాజమౌళి ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఈ విషయం మీద స్పందించలేదు. మరి మొత్తానికైతే రాజమౌళి సైతం థియేటర్ల లోనే సినిమాలను రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఓటిటి సంస్థలే సినిమాలను శాసిస్తున్నాయి.

వాళ్ళు చెప్పిన డేటు కే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమా ఇండస్ట్రీ ఎలాంటి దారుణమైన పరిస్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక దానివల్లే చాలా థియేటర్లు మూతపడుతున్నాయి. ఇక కొన్ని థియేటర్స్ ఫంక్షన్ హాల్ గా మారిపోతున్నాయి. మరి ఇలాంటి ఒక సిచువేషన్ నుంచి ఇండస్ట్రీని బయట పడేయాల్సిన బాధ్యత దర్శక నిర్మాతల మీదనే ఉందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తుండటం విశేషం…

Leave a Comment