R Ashwin Retirement from IPL: ఐపీఎల్‌ నుంచి తప్పుకున్న ధోని దోస్త్.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ పోస్ట్.. – Telugu News | Indian all rounder R Ashwin announced his retirement from the Indian Premier League

R Ashwin Retirement from IPL: భారత క్రికె‌ట్‌లో అత్యంత తెలివైన స్పిన్నర్లలో ఒకడిగా పేరుగాంచిన రవిచంద్రన్ అశ్విన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ క్రికెట్కు గతంలోనే వీడ్కోలు పలికిన అశ్విన్, ఇప్పుడు ఐపీఎల్తో సహా అన్ని రకాల ఫ్రాంచైజ్ క్రికెట్కు కూడా గుడ్బై చెప్పారు. తన అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికినట్లే, అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

“ప్రత్యేకమైన రోజు, అందుకే ఇది ఒక ప్రత్యేకమైన ప్రారంభం. ప్రతి ముగింపుకు కొత్త ప్రారంభం ఉంటుంది. ఐపీఎల్ క్రికెటర్‌గా నా సమయం ఈరోజుతో ముగుస్తుంది. కానీ వివిధ లీగ్‌ల్లో నా ప్రయాణం ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. సంవత్సరాలుగా అద్భుతమైన జ్ఞాపకాలు, సంబంధాలకు అన్ని ఫ్రాంచైజీలకు, ముఖ్యంగా ఇప్పటివరకు నాకు ఇచ్చిన ఐపీఎల్, బీసీసీఐకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా ముందున్న వాటిని ఆస్వాదించడానికి, సద్వినియోగం చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాను” అంటూ అశ్విన్ రాశాడు.

2009లో చెన్నై సూపర్ కింగ్స్‌తో అరంగేట్రం చేసిన అశ్విన్ , ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లు ఆడి, 7.20 ఎకానమీతో తన ఆఫ్-స్పిన్‌తో 187 వికెట్లు పడగొట్టాడు. అలాగే, అశ్విన్ బ్యాటింగ్‌లో కూడా మంచి కీలక పోషించాడు. ఒక అర్ధ సెంచరీతో సహా 833 పరుగులు చేశాడు. 38 ఏళ్ల అతను ఐపీఎల్‌లో ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో చెన్నై, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment