పైన ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మను గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు తెలుగులో ఆమె క్రేజీ హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె నటించిన చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అతిశయోక్తి కాదు. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఒకప్పుడు బొద్దుగా ఎంతో అందంగా కనిపించిన ఈ అమ్మడు..ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె పేరు ఫ్లోరా సైనీ. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు కానీ.. వెంకటేశ్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ మూవీ ఆశ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా ఒక్క సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి : OTT Movies: ఏం సినిమా గురూ ఇది.. కోర్టులో ఊహించని ట్విస్టులు.. ఓటీటీలో ఈ మూవీస్ చూస్తే..
ఇవి కూడా చదవండి
వెంకటేశ్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లేతోపాటు డైలాగ్స్ రాశారు. 2001లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు.. అప్పట్లనే రూ.18.04 కోట్లకు పైగా వసూల్లు రాబట్టింది. ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ స్నేహితురాలు ఆశ పాత్రలో నటించిన ఫ్లోరా సైనీ. ఇందులో కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఫ్లోరా సైనీ.. సినిమాల్లోకి మయూరిగా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఆషా సైనీగా మారింది. రాజశేఖర్ నటించిన మనసున్న మారాజు సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : ఆ సినిమా చేయడం జీవితంలోనే చెత్త నిర్ణయం.. నయనతార సంచలన కామెంట్స్..
అలాగే జగపతి బాబు, సౌందర్య కలిసి నటించిన సర్దుకుపోదాం రండి, శ్రీకాంత్ నటించిన ఓ చినదాన, 143 వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. బాలకృష్ణతో కలిసి నటించిన లక్స్ పాప పాటతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ఇప్పుడిప్పుడే వరుస పోస్టులతో నెటిజన్ల ముందుకు వస్తుంది. అయితే ఇదిలా ఉంటే.. త్వరలోనే స్టార్ట్ కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 9లో ఈ అమ్మడు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారికంగా తెలియరాలేదు. ప్రస్తుతంఈ బ్యూటీ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Cinema : ఓటీటీలో అదరగొడుతున్న కామెడీ థ్రిల్లర్.. 2 గంటలు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్..
ఇవి కూడా చదవండి : Tollywood: ఎంగేజ్మెంట్ క్యాన్సిల్.. హీరోలతో ఎఫైర్ రూమర్స్.. 42 ఏళ్ల వయసులో దుమ్మురేపుతోన్న హీరోయిన్..