
మార్నింగ్ వాకింగ్ శారీరక ఆరోగ్యానికే కాదు మానసిక స్థితిని మెరుగుపరచడానికి కూడా తోడ్పడే ఓ సాధారణ వ్యాయామం. బరువు తగ్గడం, మానసిక స్థితి మెరుగుదల, గుండె ఆరోగ్యంతో సహా మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం వేళల్లో ప్రశాంతమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలి ఉంటుంది. ఈ సమయంలో వాకింగ్ చాలా మంచిది. అయితే ఇలా మార్నింగ్ వాకింగ్ చేసే అలవాటు మీకూ ఉందా? దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నది వాస్తవమే అయినప్పటికీ.. కొన్ని సార్లు మార్నింగ్ వాకింగ్ సమయంలో చేసే కొన్ని తప్పులు మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
నీళ్లు తాగకపోవడం
ఉదయం నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగకుండా మాకింగ్ వెళ్లే పొరపాటు చేయకండి. ఈ పొరపాటు వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. నిర్జలీకరణానికి దారితీస్తుంది. కాబట్టి నడకకు వెళ్లే 15 నుండి 20 నిమిషాల ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.
ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నడవడం
ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువసేపు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీనివల్ల తలతిరుగడం, అలసట, తలనొప్పి వస్తుంది. కాబట్టి ఉదయం 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నడవకపోవడమే మంచిది. అయితే వాకింగ్‌కి ముందు అరటిపండు, నానబెట్టిన వేరుశెనగలు, ఎండిన డ్రై ఫ్లూట్స్ వంటి ఆరోగ్యకరమైన చిరుతిండి తిని వాకింగ్‌కు వెళ్లవచ్చు.
వేడెక్కకుండా నడవడం
ఉదయం వేడెక్కకుండా నడవడం వల్ల కండరాలు, కీళ్లపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల నడవడానికి ముందు రెండు నుండి ఐదు నిమిషాలు మీ శరీరాన్ని వేడెక్కించడం మంచిది.
ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం
కొంతమంది శరీరానికి శక్తినివ్వడానికి వాకింగ్‌కు వెళ్లే ముందు ఒక కప్పు కాఫీ తాగి వెళ్తుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల ఆమ్లత్వం, గుండెల్లో మంట మాత్రమే కాకుండా నరాలపై ఒత్తిడి కూడా వస్తుంది. కాబట్టి తేలికపాటి అల్పాహారం తీసుకుని వాకింగ్ వెళ్లి వచ్చిన తర్వాత కాఫీ తాగాలి.
టాయిలెట్‌కి వెళ్ళకపోవడం
బయట వెళ్ళే ముందు వాష్ రూమ్ కి వెళ్ళకుండా ఉండటం ఆరోగ్యానికి హానికరం. ఇది కడుపు సంబంధిత సమస్యలు, UTI (మూత్ర నాళాల ఇన్ఫెక్షన్) వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, వాకింగ్ కి వెళ్ళే ముందు, ఖచ్చితంగా వాష్ రూమ్ కి వెళ్లాలి. తద్వారా పూర్తి మనశ్శాంతితో హాయిగా వాకింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.
[