Mana Shankara Vara Prasad : సంప్రదాయినీ.. అనిల్ రావిపూడి మార్క్ ‘మన శంకర వర ప్రసాద్’ కొత్త పోస్టర్…

Mana Shankara Vara Prasad : సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను ఒక స్టార్ హీరోగా మార్చింది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా 2026 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దీనికంటే ముందే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్న ‘ మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు’ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఈ సినిమా నుంచి రీసెంట్గా చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22వ తేదీన ఒక గ్లింప్స్ ను అయితే రిలీజ్ చేశారు. అది ప్రేక్షకులందరిని ఆకట్టుకుంది. చిరంజీవి అభిమానులైతే ఆ గ్లింప్స్ చూసి ఆనంద పడిపోయారు. ఇక ఈరోజు వినాయక చవితి సందర్భంగా చిరంజీవి అచ్చమైన సాంప్రదాయమైన పట్టు పంచ షర్ట్ ధరించి ఒక బోట్లో వెళుతున్న ఒక పోస్టర్ ను అయితే రిలీజ్ చేశారు.

ఇక మొత్తానికైతే ఈ పిక్ ప్రేక్షకులందరితో పాటు చిరంజీవి అభిమానులను కూడా అలరిస్తోంది. మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాలో ఒక డీసెంట్ పెర్ఫార్మెన్స్ ని ఇవ్వబోతున్నారు అనేది ఈ ఫోటోతో తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా సైతం ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

కాబట్టి ఈ సినిమాలో చిరంజీవి ప్రేక్షకులను ఎలా అలరిస్తాడు అలాగే తన ఫ్యాన్స్ ను సైతం ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఈ సినిమాలో చిరంజీవి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి హీరో చేయబోతున్న సినిమాలన్ని సూపర్ సక్సెస్ కావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఇప్పుడు సెలెక్టెడ్ గా సినిమాలైతే చేస్తున్నాడు.

మరి ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక దానికి తోడుగా అనిల్ రావిపూడి సినిమాని భారీ లెవెల్లో ప్రమోట్ చేస్తారనే విషయం మనందరికీ తెలిసిందే. అందుకే ఈ పండక్కి కూడా సినిమా నుంచి ఒక పోస్టర్ ను అయితే వదిలి ప్రేక్షకులను ఆనందింప చేస్తున్నాడు. అలాగే తను ప్రమోషనల్ గా కూడా ఈ పోస్టర్ ను వాడుకుంటున్నట్టుగా తెలుస్తోంది…

Leave a Comment