మన శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే ముఖ్య అవయవాలు కిడ్నీలు(Kidney Health). ఇవి రోజుకు దాదాపు 50 గాలన్‌లకు పైగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

5 types of vegetables that are good for kidney health
Updated On : August 27, 2025 / 5:42 PM IST
Kidney Health: మన శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేసే ముఖ్య అవయవాలు కిడ్నీలు. ఇవి రోజుకు దాదాపు 50 గాలన్‌లకు పైగా రక్తాన్ని శుద్ధి చేస్తాయి. కానీ పోషకాహారం లోపించడం వల్ల, నీరు తక్కువగా తాగడం వల్ల, ఎక్కువ ఉప్పు, చక్కెర తీసుకోవడం వల్ల కిడ్నీలు బలహీనమవుతాయి. ప్రమాదంలో పడుతున్నాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి, కిడ్నీలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే, సహజమైన ఆహారం ద్వారా కిడ్నీలను ఆరోగ్యం(Kidney Health)గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ప్రత్యేకమైన కూరగాయలు కిడ్నీలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. ఆ కూరగాయలు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Periods: పీరియడ్స్ ఆపడానికి మందులు వాడుతున్నారా? ఇది ప్రాణాలతో చెలగాటమే.. జాగ్రత్త సుమీ
1.బ్రోకోలీ (Broccoli):
బ్రోకోలీలో గ్లూకోసినోలేట్స్ అనే యాక్టివ్ కాంపౌండ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది టాక్సిన్లను బయటకు పంపుతాయి. యాంటీఆక్సిడెంట్లు కిడ్నీని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ C, ఫైబర్ అధికంగా ఉండి రక్తపోటును నియంత్రిస్తాయి.
2.మెంతికూర (Fenugreek Leaves):
మెంతికూరలో డయూరెటిక్ గుణాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల మూత్ర విసర్జన పెరిగి టాక్సిన్లు బయటకు పోతాయి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనిని పప్పులో, కూరలలో, పరాఠాలలో తినవచ్చు.
3.సొరకాయ (Bottle Gourd):
సొరకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది. ఇది మూత్ర విసర్జనను పెంచి, కిడ్నీల లోపల పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపుతుంది. కిడ్నీలకు విశ్రాంతినిస్తుంది. కూరగా, పప్పుతో, జ్యూస్ రూపంలో ఉదయం తీసుకోవచ్చు.
4.ఉల్లిపాయలు (Onions):
ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ అనే యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీపై ఏర్పడే ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ రోగులకు అనుకూలంగా పనిచేస్తుంది.
కిడ్నీ ఆరోగ్యం కోసం ఎక్కువగా తీసుకోవాల్సినవి:
- రోజుకు కనీసం 2.5 లీటర్లు నీరు తాగాలి
- తక్కువ ఉప్పు, తక్కువ ప్రాసెస్డ్ ఫుడ్
- తాజా పండ్లు & కూరగాయలు
- కిడ్నీ సమస్య ఉన్నవారు ఇవి తినడకూడదు:
- ఎక్కువ పొటాషియం, ఫాస్ఫరస్ కలిగిన కూరగాయలు
- పాపకార్న్, జంక్ ఫుడ్స్, గరిటెగిన పదార్థాలు
[