IPL 2026: అశ్విన్ తర్వాత మరో నలుగురు క్రికెటర్లు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే ఛాన్స్.. లిస్టులో లెజెండ్ కూడా – Telugu News | After R Ashwin 4 More Cricketers May Retire from IPL MS Dhoni on the List

IPL 2026: భారత క్రికెట్ దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బుధవారం, ఆగస్టు 27న ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్ అయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్, ఇప్పుడు ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పడంతో.. ఇదే బాటలో మరికొంత మంది అడుగుపెట్టే అవకాశం ఉంది. రాబోయే ఐపీఎల్ 2026కు ముందు మరో 4గురు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా ఉన్నాడు.

1. ఎంఎస్ ధోనీ

మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. ధోనీ 2020లోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ధోనీ ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఐపీఎల్ 2025లో ధోనీ బ్యాట్‌తో అంతగా రాణించలేకపోయాడు. ఈ నేపథ్యంలో, ఐపీఎల్ 2026కు ముందు ధోనీ కూడా ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉంది.

2. మొయిన్ అలీ

ఇంగ్లాండ్‌కు చెందిన స్పిన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు. మొయిన్ బౌలింగ్‌లో బాగా రాణించినా, బ్యాటింగ్‌లో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో ఐపీఎల్ 2026 వేలానికి ముందు కోల్‌కతా అతన్ని రిలీజ్ చేయవచ్చని తెలుస్తోంది. ఒకవేళ కేకేఆర్ అతన్ని రిలీజ్ చేస్తే, వేలంలో అమ్ముడుపోవడం కష్టం. కాబట్టి, మొయిన్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకోవచ్చు.

3. మనీష్ పాండే

మనీష్ పాండే కూడా ఐపీఎల్ 2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో భాగం. కానీ, మనీష్‌కు కొన్ని మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం వచ్చింది. చాలా కాలంగా మనీష్ భారత జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు. దీంతో కోల్‌కతా అతన్ని కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈసారి వేలంలో మనీష్ పాండే అమ్ముడుపోవడం కూడా కష్టమే. కాబట్టి, మనీష్ కూడా త్వరలోనే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు.

4. ఇషాంత్ శర్మ

భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇషాంత్ ఐపీఎల్ 2025లో పగటి పూట మ్యాచ్‌లలో బౌలింగ్ చేసేటప్పుడు చాలా అలిసిపోయాడు. పెరుగుతున్న వయసు, ఫామ్‌ లేకపోవడం వల్ల ఐపీఎల్ 2026 వేలంలో అతనికి జట్టు దొరకడం కష్టమే. కాబట్టి, ఇషాంత్ కూడా త్వరలోనే ఐపీఎల్‌కు వీడ్కోలు పలకవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Comment