Heart Attack: యమకింకరులు డోర్ బెల్ కొట్టే టైమ్.. ఈ సమయంలో ఆదమరిస్తే అంతే సంగతి!

Heart Attack: యమకింకరులు డోర్ బెల్ కొట్టే టైమ్.. ఈ సమయంలో ఆదమరిస్తే అంతే సంగతి!

ఉదయం పూట రోజును కొత్తగా ప్రారంభిస్తాం. నిద్ర లేవగానే ఫోన్ చూడటం, కాఫీ తాగడం, రోజువారీ పనులకు సిద్ధమవడం చేస్తాం. అయితే, గుండెకు ఉదయం పూటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కార్డియాలజిస్టుల ప్రకారం, ఉదయం పూట శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఈ మార్పుల వల్ల గుండెపోటు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

డాక్టర్ సంజయ్ భోజ్‌రాజ్ అనే కార్డియాలజిస్ట్ ప్రకారం, ఉదయం పూట గుండెకు ఒక “హై-అలర్ట్” సమయం. నిద్ర లేవగానే శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తపోటు కూడా పెరుగుతుంది. రక్తంలో రక్తం గడ్డకట్టడానికి సహాయపడే ప్లేట్‌లెట్లు కూడా గట్టిగా మారతాయి. ఇవి అన్ని గుండెపై ఒత్తిడి పెంచుతాయి. అధ్యయనాల ప్రకారం, గుండెపోటు, గుండె ఆగిపోయే ప్రమాదం ఉదయం 7 నుండి 11 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది.

ఈ పొరపాట్లు గుండెకు ప్రమాదం:

ఖాళీ కడుపుతో కాఫీ: ఉదయం లేవగానే టీ లేదా కాఫీ తాగడం వల్ల గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

నీరు తాగకపోవడం: ఉదయం నిద్ర లేవగానే నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్ అవుతుంది. ఇది కూడా గుండెకు మంచిది కాదు.

మందులు  మర్చిపోవడం: రక్తపోటు, గుండె సమస్యలకు మందులు వేసుకునేవారు ఉదయం సమయానికి వేసుకోవాలి.

అకస్మాత్తుగా పని మొదలుపెట్టడం: నిద్ర లేవగానే వెంటనే పనుల్లోకి దిగడం లేదా వ్యాయామం చేయడం వల్ల గుండెపై అనవసరమైన ఒత్తిడి పెరుగుతుంది.

గుండెకు రక్షణ చర్యలు:

ఉదయం లేవగానే ముందుగా నీరు తాగండి.

మందులు సమయానికి వేసుకోండి.

ప్రొటీన్లు అధికంగా ఉండే అల్పాహారం తినండి.

10-15 నిమిషాలు చిన్నగా వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయండి.

[

Leave a Comment