ఈరోజుల్లో మనుషులు అనేకరకాల రోగాల బారిన పడుతున్నారు(Health Tips). చిన్నవయసులోనే గుండె, మెదడు సంబంధమైన వ్యాధుల బారిన

Health Tips: How to identify fruits that have been treated with chemicals
Updated On : August 27, 2025 / 2:34 PM IST
Health Tips: ఈరోజుల్లో మనుషులు అనేకరకాల రోగాల బారిన పడుతున్నారు. చిన్నవయసులోనే గుండె, మెదడు సంబంధమైన వ్యాధుల బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దానికి కారణం మనం తీసుకుంటున్న ఆహారం, వాటి తయారీకి వాడుతున్న కెమికల్స్. ఈ మధ్య కాలంలో కెమికల్స్ లేకుండా సహజంగా తయారయ్యే ఆహారాం తినడం అనేది చాలా కష్టంగా మారిపోయింది. ఇక పండ్ల విషయంలో కూడా అంతే(Health Tips). కెమికల్స్ వాడి తక్కువకాలంలోనే ఎక్కువగా పండేలా చేస్తున్నారు. అలాంటి పండ్లను తినడం వల్ల కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అందుకే “కెమికల్స్ కలపని పండ్లు” ఎంచుకోవడం చాలా అవసరం. మరి అలాంటి పండ్లు ఏంటి అనేది ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
Metabolism: మెటబాలిజం పెంచే బూస్టర్ ఫుడ్.. రోజు తింటే ఏ రోగాలు దరిచేరవు
కెమికల్స్ కలపని పండ్ల లక్షణాలు:
సహజంగా పాకే పండ్లు: ఇవి ఎలాంటి రసాయనాల వాడకం లేకుండా సహజ స్థితిలో పండుతాయి. ఉదాహరణకి సీతాఫలం (Custard Apple), జామపండు లాంటివి చెప్పుకోవచ్చు.
విత్తనాల నుండి ఉత్పత్తి చేసినవి: జీవవైవిధ్యానికి అనుగుణంగా విత్తనాల ద్వారా సాగు చేసిన పండ్లు ఎక్కువగా కెమికల్స్ రహితంగా ఉంటాయి.
ఆర్గానిక్ ఫార్మింగ్ లో పండించినవి: సేంద్రియ వ్యవసాయ విధానంలో పండే పంటల్లో ఎలాంటి కెమికల్ ఎరువులు, కీటకనాశకాలు వాడరు. సహజమైన రీతిలో సాగు చేయడం వల్ల, ఆ పండ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పొటాషియం కార్బైడ్ వల్ల హాని:
పండ్లను వేగంగా పండించేందుకు ఎక్కువగా ఉపయోగించే కెమికల్ కాల్షియం కార్బైడ్. ఇది తాజాగా, ఆకర్షణీయంగా కనిపించే పండ్లను తయారుచేస్తుంది. కానీ ఆరోగ్యపరంగా చాలా ప్రమాదకరం. ఇలా కృత్రిమంగా పండించిన పండ్లను తినడం వల్ల తలనొప్పి, మలబద్ధకం, మెదడు పని తీరుపై ప్రభావం, గర్భిణీ స్త్రీలకు సమస్యలు, దీర్ఘకాలికంగా క్యాన్సర్ ప్రమాదం వంటివి రావచ్చు.
మరి కెమికల్స్ లేని పండ్లను ఎలా గుర్తించాలి?
వాసన: సహజంగా పండిన పండ్లకు స్వచ్ఛమైన వాసన ఉంటుంది. కెమికల్స్ వల్ల పాకిన పండ్లకు ఎలాంటి వాసన ఉండదు.
రంగు: కెమికల్ ద్వారా పాకిన పండ్ల రంగు చాలా కాంతివంతంగా ఉంటుంది. సహజంగా పాకిన పండ్లకు సహజమైన రంగు ఉంటుంది.
టెక్చర్: సహజమైన పండు మృదువుగా ఉంటుంది. కెమికల్స్ తో పండించిన పండు కాస్త గట్టిగా ఉండే అవకాశం ఉంది.
కెమికల్స్ లేని పండ్లలో కొన్ని ఉదాహరణలు:
- సీతాఫలం
- జామపండు
- మామిడి (రైతు దగ్గర నుంచి కొనడం ఉత్తమం)
- అరటి పండు (రైతుల దగ్గర తీసుకోవచ్చు).
[