నెయ్యిలో పోషకాలు : నెయ్యిని వెన్న నుండి తయారు చేస్తారు. నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. హెల్త్‌లైన్ ప్రకారం.. నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. నెయ్యి జీవక్రియను వేగవంతం చేస్తుంది.
వెన్నలోని పోషకాలు : వెన్న కూడా పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో కొవ్వు, కేలరీలు, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. విటమిన్ A, D, E, B12 లకు వెన్న మంచి మూలం. వెన్నలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేసి, రక్తపోటును నియంత్రిస్తుంది. వెన్నలో లాక్టోస్, కేసీన్ అనే పాల ప్రోటీన్లు ఉంటాయి. ఇవి కొందరికి పడకపోవచ్చు.
నెయ్యి Vs వెన్న: కొవ్వు విషయానికి వస్తే.. నెయ్యిలో వెన్న కంటే ఎక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. ఒక టేబుల్‌స్పూన్ నెయ్యిలో సుమారు 120 కేలరీలు ఉంటే, అదే పరిమాణంలో వెన్నలో 100 కేలరీలు ఉంటాయి. అయితే నెయ్యి వెన్న కంటే త్వరగా జీర్ణమవుతుంది. ఇది తేలికగా ఉంటుంది. వెన్నలో ఉన్న పాల పదార్థాలు కొందరికి జీర్ణ సమస్యలు కలిగించవచ్చు.
నెయ్యిని వెన్న కంటే మెరుగైనదిగా భావిస్తారు. ఎందుకంటే.. లాక్టోస్, కేసీన్ లేకపోవడమే దీనికి కారణం. నెయ్యిలో ఇవి ఉండవు కాబట్టి, లాక్టోస్ అసహనం ఉన్నవారు కూడా నెయ్యిని సురక్షితంగా తినవచ్చు. నెయ్యికి అధిక స్మోక్ పాయింట్ ఉంటుంది. దీనివల్ల వంట చేసేటప్పుడు ఇది త్వరగా పొగ రాదు. పోషకాలను కోల్పోదు. వెన్నకి తక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేడి చేస్తే త్వరగా మాడిపోతుంది. నెయ్యి తేలికగా జీర్ణమవడంతో పాటు జీవక్రియను పెంచుతుంది.
చివరిగా నెయ్యి లేదా వెన్న రెండింటిలోనూ కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వీటిని పరిమితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. మీ వ్యక్తిగత ఆరోగ్య అవసరాలు, జీవనశైలిని బట్టి వీటిలో ఏది ఎంచుకోవాలో నిర్ణయించుకోవచ్చు. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
[