Ghaati Preview Show Review : అనుష్క ‘ఘాటీ’ ప్రివ్యూ షో రివ్యూ..క్రిష్ అంచనాలను నిలబెట్టుకున్నాడా?

Ghaati Preview Show Review : చాలా కాలం గ్యాప్ తర్వాత లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి(Anushka Shetty) ప్రధాన పాత్ర పోషించిన ‘ఘాటీ'(Ghaati Movie) చిత్రం సెప్టెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కోణాన్ని చూపించారని, కచ్చితంగా ఈ సినిమా ఆయన కం బ్యాక్ గా నిలుస్తుందని టీజర్ ని చూసినప్పుడే అందరూ ఒక అంచనా కి వచ్చేసారు. థియేట్రికల్ ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓవరాల్ గా మినిమం గ్యారంటీ కథ లాగా అనిపిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో వేసారట. ఈ ప్రివ్యూ షో కి అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి వివరంగా చూద్దాం.

ఫస్ట్ హాఫ్ ప్రారంభం నుండే కథ లోకి వెళ్ళిపోతాడట డైరెక్టర్ క్రిష్. అనుష్క ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా సాఫ్ట్ గా కనిపిస్తుందట, కొన్ని పరిస్థితుల కారణంగా ఆమె వయొలెంట్ గా మారిపోతుందట. ఒక విధంగా ఆమె క్యారక్టర్ ఆర్క్ ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం విజయశాంతి క్యారక్టర్ ఆర్క్ ని ఉదాహరణగా తీసుకొని తీర్చి దిద్దినట్టు ఉంటుందట. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆమె క్యారక్టర్ బిల్డింగ్ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టాడట. ఇక సెకండ్ హాఫ్ మొత్తం అనుష్క తన నట విశ్వరూపం చూపించిందని టాక్. రెగ్యులర్ క్రిష్ సినిమాలు లాగానే, ఈ సినిమా కూడా నిదానమైన స్క్రీన్ ప్లే తోనే నడుస్తుందట, కానీ ఆడియన్స్ కి బోర్ కొట్టకుండా తియ్యడం లో క్రిష్ సక్సెస్ అయ్యాడట. మరి ఈ చిత్రాన్ని ఆడియన్స్ ఎంత మేరకు ఆదరిస్తారో చూడాలి. ఒకవేళ సూపర్ హిట్ అయితే మాత్రం అనుష్క కి మరో భారీ హిట్ పడినట్టే.

‘భాగమతి’ చిత్రం తర్వాత భారీ గ్యాప్ తీసుకున్న అనుష్క, 2023 వ సంవత్సరం లో ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ ద్వారా మళ్ళీ వెండితెర పై కనిపించింది. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది కూడా. కానీ ఈ సినిమా కూడా వచ్చి దాదాపుగా రెండేళ్లు కావొస్తుంది. ఇలా ప్రతీ సినిమాకు మధ్య అనుష్క ఇంత భారీ గ్యాప్స్ ఇవ్వడం ఆమె అభిమానులకు అసలు నచ్చడం లేదు. మరి ‘ఘాటీ’ చిత్రం ఆమె అభిమానుల ఆకలి ని తీరుస్తుందో లేదో చూడాలి. ఈ చిత్రం కోసం క్రిష్ ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని మధ్యలో వదిలేసి వచ్చాడు. అంటే ఈ సినిమా కథ పై ఆయనకు ఎంత గట్టి నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది.

Leave a Comment