ఈ ఆధునిక జీవనశైలిలో చాలామంది తమ ఆరోగ్యం గురించి, ముఖ్యంగా గుండె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. తరచుగా అల్పాహారంలో గుడ్లు తినేవారిలో ఒక సాధారణ ప్రశ్నగా మారింది. గుడ్లలోని కొలెస్ట్రాల్ గుండెకు మంచిదా కాదా? అనే సందేహాలు చాలా మందిలో ఉండేవి. గతంలో గుడ్లలోని కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం అని బాగా నమ్మేవారు.. ఇప్పుడు వాటిని శాస్త్రవేత్తలు, ఆరోగ్య నిపుణులు ఈ అపోహలను తొలగిస్తున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్లలోని కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని కలిగించదు. గుడ్లు వాస్తవానికి అనేక ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం. ఒక పెద్ద గుడ్డులో దాదాపు 78 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఎ 8శాతం, ఫోలేట్ 6శాతం, విటమిన్ బి5 14శాతం, విటమిన్ బి12 23శాతం, బి2 20శాతం, పాస్ఫరస్ 7శాతం, సెలీనియం 28శాతం ఉంటాయి. ఈ పోషకాలన్నీ గుడ్లు ఒక సూపర్‌ఫుడ్'గా మారుస్తాయి.
గుండె జబ్బులకు అసలు కారణం..? : గుండె జబ్బులకు గుడ్లు కారణం కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనికి శరీరంలో గ్లూకోజ్ క్రమబద్ధీకరణలో లోపమే ప్రధాన కారణమని అంటున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, రక్త కణాల వాపు, ఆక్సీకరణ వంటివి గుండె జబ్బులకు కారణమని చెప్పారు.
అధికంగా చక్కెర తీసుకున్నప్పుడు, అది మన శరీరంలో ఇన్సులిన్, గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీని ఫలితంగా కాలేయం చెడు LDL కణాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో రక్తంలో వాపు పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మీరు ఆరోగ్యంగా ఉంటే, గుడ్లు తినడానికి వెనుకాడకండి. సమతుల్య ఆహారం తీసుకోండి. చక్కెర జోడించిన, ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, వైద్యుడిని సంప్రదించండి. కాబట్టి మీరు అల్పాహారంగా గుడ్లు తీసుకున్నప్పుడు, ఎటువంటి భయం లేకుండా వాటిని ఆస్వాదించండి.
[