కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. అంతేకాకుండా ఈ నీళ్లలో శరీరానికి మేలు చేసే అనేక ముఖ్యమైన పోషకాలు కూడా ఉన్నాయి. అయితే కొంతమందికి కొబ్బరి నీళ్లు తాగడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఏలాంటి వ్యక్తులు కొబ్బరి నీళ్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి నీళ్లలో పెద్ద మొత్తంలో పొటాషియం ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటే.. ఇలాంటి వారు కొబ్బరి నీళ్లు తాగడం మానేయాలి. ఇది హైపర్ కలేమియాకు కారణమవుతుంది. అందుకే కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకుండా ఉండాలి.
కొబ్బరి నీళ్లు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అయితే తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదు. కొబ్బరి నీళ్లు తాగితే బలహీనత, తలతిరుగుతున్నట్లు అనిపించే అవకాశం ఉంది.
శస్త్రచికిత్స సమయంలో శరీర రక్తపోటును సమతుల్యంగా ఉంచడం ముఖ్యం. అందుకే శస్త్రచికిత్సకు ముందు, ఆ తరువాత కొబ్బరి నీళ్లు తాగే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం అవసరం. కాబట్టి ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు కొబ్బరి నీళ్లు తాగడం మంచిది.
[