Site icon Desha Disha

Asia Cup 2025 : ఆసియా కప్‎లో బ్యాట్స్‌మెన్ దండయాత్ర..  రికార్డులు బద్దలు కొట్టిన టీమ్స్ ఇవే! – Telugu News | Top 5 Highest Team Totals in Asia Cup T20 History!

Asia Cup 2025 : ఆసియా కప్‎లో బ్యాట్స్‌మెన్ దండయాత్ర..  రికార్డులు బద్దలు కొట్టిన టీమ్స్ ఇవే! – Telugu News | Top 5 Highest Team Totals in Asia Cup T20 History!

Asia Cup 2025 : టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించడం ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆసియా కప్ టీ20 టోర్నమెంట్‌లో కూడా బ్యాట్స్‌మెన్‌లు బౌలర్లను ఉతికి ఆరేశారు. తమ టీమ్‌లకు భారీ స్కోర్‌లు అందించారు. ఈ విషయంలో భారత జట్టు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసియా కప్ టీ20 చరిత్రలో టాప్ 5 అత్యధిక టీమ్ స్కోర్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.

1. భారత్ vs ఆఫ్ఘానిస్తాన్ (2022, దుబాయ్)

స్కోరు: 212/2

2022లో ఆఫ్ఘానిస్తాన్‌పై భారత్ సాధించిన ఈ స్కోరు ఏసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోరుగా నిలిచింది. కేవలం రెండు వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ భారీ లక్ష్యం ముందు ఆఫ్ఘానిస్తాన్ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది.

2. పాకిస్తాన్ vs హాంకాంగ్ (2022, షార్జా)

స్కోరు: 193/2

అదే ఏడాది పాకిస్తాన్ కూడా హాంకాంగ్‌పై భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ భాగస్వామ్యంతో పాకిస్తాన్ 193 పరుగుల భారీ లక్ష్యం నిర్మించింది. ఈ స్కోరు హాంకాంగ్‌కు చాలా కష్టమైంది. పాకిస్తాన్ సునాయాసంగా గెలిచి తమ బలాన్ని నిరూపించుకుంది. ఇది పాకిస్తాన్ జట్టుకు ఏసియా కప్ టీ20 చరిత్రలో అత్యధిక స్కోరు.

3. భారత్ vs హాంకాంగ్ (2022, దుబాయ్)

స్కోరు: 192/2

ఈ జాబితాలో భారత జట్టు మరోసారి చేరింది. 2022లో హాంకాంగ్‌పై భారత జట్టు మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ విధ్వంసకర బ్యాటింగ్‌తో భారత్ 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. ఇది ఏసియా కప్ టీ20 చరిత్రలో మూడవ అత్యధిక స్కోరు.

4. శ్రీలంక vs బంగ్లాదేశ్ (2022, దుబాయ్)

స్కోరు: 184/8

2022లో దుబాయ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చాలా ఉత్కంఠగా సాగింది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం 19.2 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి 184 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఓపికతో ఆడుతూనే దూకుడు ప్రదర్శించి ఈ విజయం సాధించారు.

5. బంగ్లాదేశ్ vs శ్రీలంక (2022, దుబాయ్)

స్కోరు: 183/7

అదే మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ కూడా అద్భుతంగా ఆడింది. వారు 20 ఓవర్లలో 183 పరుగులు చేశారు. కానీ, శ్రీలంక చివరి ఓవర్లలో విజృంభించి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ ఏసియా కప్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటిగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Exit mobile version