AP DSC 2025 Certificate Verification: రేపట్నుంచే మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభం.. కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే – Telugu News | Andhra Pradesh DSC 2025 Certificate Verification to begin from August 28

అమరావతి, ఆగస్ట్‌ 27: రాష్ట్రంలో కూటమి సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన మరోసారి వాయిదా పడింది. తాజా ప్రకటన మేరకు ఈ ప్రక్రియ ఆగస్టు 28వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ప్రారంభం కానున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్‌ వెంకట కృష్ణారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు వారి లాగిన్‌ ఐడీల ద్వారా ఆగస్టు 26 మధ్యాహ్నం నుంచి కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కాల్‌ లెటర్లలోని తెల్పిన సూచనలను కచ్చితంగా పాటించాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు తీసుకువెళ్లాల్సిన అన్ని సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే ముందు కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకుని తీసుకురావాలని సూచించారు. అలాగే సంబంధిత సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లోనూ అప్‌లోడ్‌ చేయాలని అన్నారు. దీంతో అభ్యర్ధులు సర్టిఫికెట్ల అప్‌లోడ్‌లో నిమగ్నమై ఉన్నారు.

మెగా డీఎస్సీ 2025 కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ ప్రైవేటు పాఠశాలల్లో 11 వేల మందికి ఉచిత సీట్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా హక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం కోటా కింద ఉచిత ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఈ మేరకు కేటాయించిన సీట్ల జాబితాను సమగ్ర శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు ఆగస్టు 25న విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు తొలుత మూడు కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో సీట్లు కేటాయించారు. అనంతరం నివాస ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలకు ఆగస్టు 12 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. ఈ మేరకు తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి సీట్లు కేటాయించారు. ప్రస్తుతం దాదాపు 11,702 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు డైరెక్టర్‌ బి శ్రీనివాసరావు తెలిపారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీలోపు ప్రవేశాలు పొందిన ఆయా పాఠశాలల్లో చేరాలని సూచించారు. తుది గడువులోపు చేరకపోతే కేటాయించిన సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Leave a Comment