స్కూల్లో హీరో నాని ఎంతమందిని లవ్ చేసాడో చెప్పేసిన వాళ్ళ టీచర్!

Hero Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు నాని…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. మొదట్లో క్లాస్ సినిమాలు చేస్తూ మన పక్కింటి కుర్రాడిలా అందరిని మెప్పించిన నాని…ఇప్పుడు మాస్ జపం చేస్తున్నాడు దసర సినిమాతో మాస్ హీరోగా అవతరించిన నాని ఇప్పుడు మరోసారి ప్యారడైజ్ సినిమాతో బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో తన నటన అద్భుతంగా ఉండబోతుందని అలాగే సినిమా కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని ప్రమోట్ అయితే చేస్తున్నారు. మరి దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తూ ఉండడం విశేషం…ఇక రీసెంట్ గా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్మూ నిశ్చయమ్మురా’ అనే షోలో అయితే పాల్గొన్నాడు. ఇక ఇప్పుడు ఈ షోకు సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో నాని తన చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నాడు. స్కూల్లో తనను ఏ టీచరు పట్టించుకునేది కాదట. కానీ ఒక సుందరం అనే మేడం మాత్రం ప్రతిరోజు వీళ్ళ అమ్మకి ఫోన్ చేసి మరి నాని ఏ టైం కి లేస్తున్నాడు, ఎంతసేపు చదువుతున్నాడు అనే విషయాలను అడిగిమరీ తెలుసుకునేదట. ఇక ఆమె నాని మీద చాలా స్పెషల్ కేర్ తీసుకునేదని నాని చెప్పాడు. ఇక ఈ షోలో సుందరం మేడం కూడా రావడం నానిని ఆశ్చర్యానికి గురి చేసింది.

మరి ఇదే షోలో సుందరం మేడంతో జగపతిబాబు చిన్నప్పుడు నానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా నాని స్కూల్లో ఎంతమందిని ప్రేమించాడు అనే విషయాలను కూడా సుందరం మేడం బయట పెట్టింది. దాదాపు నాని ముగ్గురు అమ్మాయిలను ఇష్టపడ్డట్టుగా సుందరం మేడమ్ అయితే తెలియజేసినట్టుగా తెలుస్తోంది…

ఆ విషయాలు కూడా తన దాకా వచ్చాయని నాని ఆ ఏజ్ లో ప్రేమ ఏంటని తను మందలించినట్టుగా చెప్పింది. ఇక తన ఇంట్లో వాళ్ల అమ్మతో కూడా ఈ విషయాన్ని డిస్కస్ చేసినట్టుగా ఆమె ఈ షోలో చెప్పినట్టుగా తెలుస్తోంది… మరి ఏది ఏమైనా కూడా ఈ షోలో నాని ఇంకా ఎంతమందిని లవ్ చేశాడు.

ఆయనను స్కూల్ లో అందరూ ఏమని పిలిచేవాళ్ళు అనే విషయాలను కూడా ఆ మేడం చెప్పినట్టుగా తెలుస్తోంది…మరి వాటికి సంబంధించిన ఫుల్ క్లారిటీ రావాలంటే మాత్రం ఆదివారం 9 గంటలకు ఈ షో జీ సినిమాలు లో టెలికాస్ట్ అవుతోంది. కాబట్టి ఈ షో ని చూస్తే ప్రతి ఒక్కరికి ఇంకా ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…

 

Leave a Comment