– దివ్య స్కూల్ విద్యార్థులు వినూత్న ప్రయత్నం
విశాలాంధ్ర – రాజానగరం : పర్యావరణానికి హాని చేయని వినాయకుని మట్టి విగ్రహాలను పూజించాలని దివ్య విద్యాసంస్థలు వైస్ చైర్మన్ బర్ల విజయ్ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మండల కేంద్రమైన రాజానగరంలోని విద్యార్దులు నడుం కట్టి మట్టి గణపతి మట్టితో, ఆకులతో,పిండి, కాగితాలతో గణనాధుని ప్రతిమలను భక్తిశ్రద్ధలతో మంగళవారం తయారు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. కొంతమంది చిన్నారులు వినాయక వేషధారణ ధరించి చూపరులను ఆకర్షించారు.ఇందుకు సంబంధించి పత్రిక ప్రకటనను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం తమ సంస్థ విద్యార్ధులు పర్యావరణ హిత వినాయక విగ్రహాల తయారు చేశారన్నారు.అదే విధంగా గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం(జిజియూ) నందు జరిగిన కార్యక్రమంలో జిజియూ విసి డాక్టర్ యూ.చంద్ర శేఖర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతిఒక్కరు మట్టి గణపతి ప్రతిమలను పూజించాలని పిలుపునిచ్చారు.అనంతరం విద్యార్థులు తయారు చేసిన మట్టి గణపతి ప్రతిమలను పోటీల్లో ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్దులను అభినందించారు. ఈ దివ్య స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో విద్యాసంస్థల ప్రిన్సిపాల్,ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.