మట్టి గణపతి విగ్రహాలు ఉచిత పంపిణీ

 విశాలాంధ్ర – తాళ్లపూడి : మట్టి తో చేసిన వినాయక ప్రతిమలనే  గణపతి పూజకు వినియోగించాలని తాళ్లపూడి కి చెందిన గణేష్ అనే యువ వర్తకుడు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ మంగళ వారం రోజున షాపింగ్ కి వచ్చిన వినియోగదారులకు  మట్టి తో చేసిన ఒక్కొక్క విగ్రహాన్ని ఉచితంగా అంద చేసారు. వినాయక చవితి సందర్భముగా తాళ్లపూడి కి చెందిన మాంటిస్సోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్  ఆవరణ నందు పెద్ద గణపతి ఆకృతిని రంగులతో చిత్రీకరించారు. ఇది అందర్నీ ఆకట్టుకుంది. ఈ స్కూల్ లో ప్రతీ పండుగలు ను వివరిస్తూ, సాంప్రదాయ పండుగలను వివరిస్తూ రూపకాలను ప్రదర్శిస్తూ, పిల్లలకు పండుగల పట్ల ప్రిన్సిపాల్ అనిష్ అవగాహన కల్పించారు. తాళ్లపూడి మానవత శాఖ అద్వర్యం లో పర్యావరణ పరి రక్షణ కార్యక్రమం లో భాగంగా వినాయక చతుర్థి పూజకు రంగు బొమ్మలతో పొల్యూషన్ పెరగకుండా మట్టి బొమ్మలు మేలు అని చెబుతూ మట్టి వినాయక ప్రతిమలు ఉచితంగా అందించినట్లు మానవత శాఖ తాళ్లపూడి అధ్యక్షులు వెలుగుబంటి శ్రీనివాస్ తెలిపారు. తాళ్లపూడిలో మట్టి బొమ్మలు పంపిణీ చేపట్టగా పలువురు సభ్యలు పాల్గొన్నారు.

Leave a Comment