భారత్‌కు ట్రంప్ BIG షాక్.. ఈ రాత్రి నుంచే సుంకాలు అమలు

భారత్‌కు ట్రంప్ BIG షాక్.. ఈ రాత్రి నుంచే సుంకాలు అమలు

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) భారత్‌కు మరో భారీ షాకిచ్చారు. పెంచిన సుంకాలు(US Tariffs) ఈ రాత్రి నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, భారత్‌పై 50% అదనపు సుంకాలు(Taxes) విధిస్తూ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేస్తుందనే నెపంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయమైన, అసమంజసమైన నిర్ణయం అంటూ ఇప్పటికే భారత్ మండిపడింది. ఈ మేరకు విదేశాంగశాఖ గతంలో ప్రకటన సైతం విడుదల చేసింది. అందులో.. భారత్‌ రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవడం దేశ ప్రజల ప్రయోజనాలకు సంబంధించినదిగా పేర్కొంది. ట్రంప్ ప్రకటించిన సుంకాలు భారత ఎగుమతులపై, ముఖ్యంగా ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఆభరణాల వంటి రంగాలపై ప్రభావం చూపనున్నాయని, ఇది MSMEలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ, భారత్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని, రష్యా నుండి చమురు దిగుమతులు కొనసాగిస్తామని పునరుద్ఘాటించింది.

Leave a Comment