బంగాళాఖాతంలో అల్పపీడనం..! వినాయక మండపాల నిర్వాహకులకు కీలక సూచనలు – Telugu News | Andhra Pradesh Heavy Rains Warning Key instructions for Vinayaka Mandapa organizers

బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. తీరం వెంబడి 40-60 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో వినాయక మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. బుధవారం నుంచి వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వినాయక చవితి కోసం గల్లీ గల్లీలో ఉత్సవ మండపాలు ఏర్పాటు అయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Leave a Comment