ప్రియాంకను ఎక్కించుకుని రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ..

నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఆసక్తికరంగా సాగుతోంది. ఈరోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఒక దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. రాహుల్ గాంధీ స్వయంగా బైక్ నడపగా, ఆయన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వెనుక కూర్చుని ప్రయాణించారు. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకే బైక్‌పై ర్యాలీలో పాల్గొన్న ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ‘ఇండియా’ కూటమి నేతలు నిర్వహిస్తున్న ఈ యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ముజఫర్‌పూర్ బైక్ ర్యాలీలో రాహుల్‌, ప్రియాంకలతో పాటు ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్, ఇతర కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి సుమారు 65 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తూ ఈ యాత్రను చేపట్టారు.

The post ప్రియాంకను ఎక్కించుకుని రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ.. appeared first on Navatelangana.

Leave a Comment