ఓజీ నుండి ‘సువ్వి సువ్వి’ సాంగ్ వచ్చేసింది..

Suvvi Suvvi Song from OG: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ఓజీ'(They Call Him OG) మూవీ వచ్చే నెల 25న విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా వదులుతున్నారు మేకర్స్. రీసెంట్ గానే ఫైర్ స్ట్రోమ్ పాటని విడుదల చేసిన మేకర్స్, నేడు వినాయక చవితి సందర్భంగా ‘సువ్వి సువ్వి సువ్వాలా'(Suvvi Suvvi) అనే మెలోడీ సాంగ్ ని విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, ఆహ్లాదకరమైన మ్యూజిక్ తో ఈ పాట ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. సాధారణంగా ఇలాంటి పాటలకు మొదట్లో పెద్దగా రెస్పాన్స్ రాదు, పైగా ఓజీ లాంటి గ్యాంగ్ స్టర్ చిత్రం లో ఇలాంటి సున్నితమైన పాటలు ఏంటి అని ప్రతీ ఒక్కరు అనుకుంటారు. కానీ ఈ పాట మొదటి సారి విన్నప్పుడే అందరికీ తెగ నచ్చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ పెయిర్ చూసేందుకు ఎంతో చక్కగా అనిపించింది.

Also Read: ‘ఓజీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ వచ్చేసింది..ముఖ్య అతిథి ఎవరంటే!

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ లో రొమాంటిక్ యాంగిల్ ని చూసి జనాలు ఎన్నో ఏళ్ళు అయిపోయింది. అలాంటి రొమాంటిక్ యాంగిల్ ని కూడా ఈ చిత్ర దర్శకుడు సుజిత్ బయటకి తీసాడు. వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూసిన తర్వాత అభిమానుల ఆనందానికి హద్దులే లేవు. చూస్తుంటే ఇది చాలా ఎమోషనల్ సాంగ్ లాగా అనిపిస్తుంది. పాట చివర్లో వచ్చే మ్యూజిక్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అంత తేలికగా మరచిపోలేము. ఊపు చూస్తుంటే ఈ పాట కచ్చితంగా ఫైర్ స్ట్రోమ్ కి మించి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ లుక్స్ అయితే వేరే లెవెల్ లో ఉన్నాయని అనుకోవచ్చు. ఈ రేంజ్ లో లుక్స్, అది కూడా 53 ఏళ్ళ వయస్సు లో మైంటైన్ చేయడం చిన్న విషయం కాదు. అది కూడా రాజకీయాలతో ఫుల్ బిజీ గా ఉండే వ్యక్తులకు లుక్స్ ని మైంటైన్ చేయడం చాలా కష్టం, పవన్ కళ్యాణ్ అసలు ఎలా మ్యానేజ్ చేస్తున్నాడో అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.

Also Read: ‘సుందరకాండ’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?

ఇదంతా పక్కన పెడితే ఈ కాలం లో ఒక పాట వేరే లెవెల్ లో రీచ్ అవ్వాలంటే ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అవ్వాలి. అప్పుడే యూత్ ఆడియన్స్ లో క్రేజ్ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే ఫైర్ స్ట్రోమ్ పాట ఇన్ స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడు ఈ పాట కూడా ఆ రేంజ్ లో హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ పాట క్రియేట్ చేసే మ్యాజిక్ ఎలా ఉండబోతుంది అనేది.

 

Leave a Comment