ఐపీఎల్‌కూ అశ్విన్‌ గుడ్‌బై..

– Advertisement –

నవతెలంగాణ – హైదరాబాద్ : టీమ్‌ఇండియా మాజీ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్‌.. తాజాగా ఐపీఎల్‌ ఫార్మాట్‌ నుంచి కూడా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అశ్విన్‌ ఐపీఎల్‌లో 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు తీశాడు. చెన్నై, పంజాబ్‌, దిల్లీ, రాజస్థాన్‌, పుణె జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. అశ్విన్‌.. టీమ్‌ఇండియా తరఫున 106 టెస్టులు ఆడి 537 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో 3,503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలున్నాయి. అశ్విన్‌కు ఈ ఫార్మాట్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్‌ 124. అలాగే అతడు 116 వన్డే మ్యాచుల్లో 156 వికెట్లు తీసుకున్నాడు. 65 టీ20 మ్యాచుల్లో 72 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

– Advertisement –

Leave a Comment