ఆలస్యంగా తల్లి కావాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్.. ముఖ్యంగా 35 ఏళ్లు దాటిన వారికి IVF విధానంలో ఒక కొత్త ఆశ చిగురించింది. పిండాలను గర్భాశయంలో ప్రవేశపెట్టడానికి ముందే వాటిపై ఒక ప్రత్యేకమైన జెన్యు పరీక్ష చేయడం ద్వారా గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయని.. ఇక తక్కువ సమయంలోనే బిడ్డను కనవచ్చని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఈ పరిశోధన వివరాలు జనరల్ ఆఫ్ క్లినికల్ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా ఎక్కువ వయసున్న మహిళల్లో ఏర్పడే పిండాలలో క్రోమోజోముల పరమైన లోపాలు ఉండే ప్రమాదం ఎక్కువ. దీనివల్లనే IVF ప్రయత్నాలు విఫలమవడం, గర్భశ్రావాలు జరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు UK లోని కింగ్స్ కాలేజ్ లండన్ పరిశోధకులు PGT-A అనే పరీక్షపై దృష్టి పెట్టారు. ఈ పరీక్ష ద్వారా పిండాలలోని క్రోమోజోముల సంఖ్యను ముందుగానే పరిశీలించి ఆరోగ్యకరమైన పిండాలను మాత్రమే గర్భాశయంలోకి బదిలీ చేస్తారు.
ఈ అధ్యయనం కోసం 35 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది మహిళలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపుకు PGT-A పరీక్ష చేసిన పిండాలను మరో గ్రూపునకు సాధారణ పిండాలను బదిలీ చేశారు. మూడు సార్లు పిండ బదిలీ చేసిన తర్వాత ఫలితాలను పరిశీలించగా PGT-A పరీక్ష చేయించుకున్న గ్రూపులో జననాల రేటు 72%గా ఉండగా.. సాధారణ గ్రూపులో అది కేవలం 52%గానే నమోదైంది. ముఖ్యంగా PGT-A గ్రూపులోని మహిళలు తక్కువ ప్రయత్నాల్లోనే గర్భం దాల్చునట్లు పరిశోధకులు గుర్తించారు.
కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన డాక్టర్ యూసుఫ్ బి బి జాన్ మాట్లాడుతూ ప్రస్తుతం 35 ఏళ్లు దాటిన తర్వాతే చాలా మంది మహిళలు పిల్లలని కంటున్నారని.. ఈ వయసులో క్రోమోజోముల లోపాలున్న పిండాలు ఏర్పడే ప్రమాదం ఎక్కువని అన్నారు. తమ పరిశోధన ప్రకారం PGT-A పరీక్ష ద్వారా ఈ వయసు మహిళలు త్వరగా పిల్లలని కనవచ్చని.. అయితే.. పదేపదే IVF విఫలమవడం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని కూడా తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ శ్రేష్ శుంకర్ మాట్లాడుతూ.. ఈ ఫలితాలను నిర్ధారించడానికి మరిన్ని పెద్ద అధ్యయనాలు అవసరమని.. అయినప్పటికీ తక్కువ సమయంలోనే గర్భం దాల్చేలా చేయడం ద్వారా పెద్ద వయసు మహిళలపై IVF చికిత్స మూల్య శారీరక మానసిక భారాన్ని తగ్గించవచ్చని తెలిపారు.
[