Trump Warned China: ఇండియా అయిపోయింది.. ఇక చైనామీద పడ్డ ట్రంప్‌!

Trump Warned China: అమెరికాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రపంచ దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. ఇప్పటికే చాలా దేశాలపై సుంకాల మోతమోగించారు. భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. ఇక ఇప్పుడు చైనాపై పడ్డడు ట్రంప్‌. చైనా ప్రపంచ రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ ఉత్పత్తిలో సుమారు 90% వాటాను నియంత్రిస్తుంది. ఈ మ్యాగ్నెట్స్‌ ఆటోమోటివ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, రెన్యూవబుల్‌ ఎనర్జీ వంటి కీలక పరిశ్రమలకు అత్యవసరం. అమెరికా వంటి దేశాలు ఈ సరఫరాపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి, ఇది చైనాకు వాణిజ్య చర్చల్లో బలమైన పైచేయిని ఇస్తుంది. చైనా రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై నియంత్రణలను కఠినం చేసింది, దీనిని అమెరికా టారిఫ్‌లకు ప్రతీకారంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌ 200% టారిఫ్‌ విధిస్తామని హెచ్చరించారు.

Also Read: పెళ్లై, కూతురున్నా ప్రియుడితో వెళ్లింది.. చివరకు ఇలా అయ్యింది

ఒత్తిడి వ్యూహం..
ట్రంప్‌ హెచ్చరికను చైనాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంగా చూడవచ్చు. ‘మాకు మ్యాగ్నెట్స్‌ ఇవ్వకపోతే 200% టారిఫ్‌ విధిస్తాం‘ అని ఆయన పేర్కొన్నారు, అయితే ‘ఈ సమస్య రాదని భావిస్తున్నాం‘ అని సమస్యను తగ్గించే ప్రయత్నం కూడా చేశారు. గట్టి హెచ్చరికలతో ఒత్తిడి చేయడం, అదే సమయంలో చర్చలకు తలుపులు తెరిచి ఉంచడం ట్రంప్‌కు అలవాటైంది. బీజింగ్‌లోని ఓ థింక్‌ట్యాంక్‌ అధ్యక్షుడు హెన్రీ వాంగ్‌ ఈ హెచ్చరికలను ‘బ్లఫింగ్‌‘గా అభివర్ణించారు, ట్రంప్‌ చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దగా మాట్లాడుతున్నారని సూచించారు. 2025 ఆరంభంలో అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. రెండు దేశాలు ఒకదానిపై ఒకటి మూడంకెల టారిఫ్‌లను విధించాయి, జూన్‌5లో లండన్‌లో జరిగిన చర్చల్లో టారిఫ్‌లను తగ్గించేందుకు ఒప్పందం కుదిరింది, అమెరికా టారిఫ్‌లను 55%కి, చైనా 10%కి తగ్గించింది. ఈ ఒప్పందం నవంబర్‌ 10 వరకు కొనసాగనుంది, అయితే రేర్‌ ఎర్త్‌ సరఫరా నియంత్రణలపై వివాదం ఇంకా కొనసాగుతోంది.

స్పందించని చైనా..
చైనా ఇప్పటివరకు ట్రంప్‌ హెచ్చరికలపై స్పష్టమైన స్పందన ఇవ్వలేదు. జూన్‌ 2025లో జరిగిన ఒప్పందంలో భాగంగా, చైనా ఆరు నెలలపాటు రేర్‌ ఎర్త్‌ ఎగుమతులపై నియంత్రణలను సడలించింది, అయితే సైనిక అవసరాలకు కావాల్సిన కొన్ని ప్రత్యేక రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌పై ఎగుమతి ఆంక్షలను కొనసాగిస్తోంది. ఈ విషయంలో చైనా తన ఆధిపత్యాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చైనా వ్యూహం దీర్ఘకాలంలో అమెరికా, దాని మిత్ర దేశాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దీంతో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు అమెరికా ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా వంటి దేశాలతో సహకారం ద్వారా రేర్‌ ఎర్త్‌ సరఫరాను బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికాలోని ఎంపీ మెటీరియల్స్‌ వంటి కంపెనీలు స్థానిక ఉత్పత్తిని పెంచేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి,

మొత్తంగా మొన్నటి వరకు భారత్‌పై భారీగా సుంకాలు విదించిన ట్రంప్‌.. ఇప్పుడు చైనాను బెదిరిస్తున్నారు. ఇదే సమయంలో చైనాకు భయపడుతున్నారు. రష్యా ఆయిల్‌ విఝయంలో భారత్‌పై సుంకాలు విధించిన ట్రంప్‌.. చైనా దిగుమతి చేసుకుంటున్నా దాని జోలికి మాత్రం వెళ్లడం లేదు. తాజాగా 200% టారిఫ్‌ హెచ్చరిక చేసి కూడా ఆ పరిస్థితి రాదంటూ వ్యాఖ్యానించడం కూడా చైనాతో కయ్యానికి ట్రంప్‌ భయపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Comment