Tollywood Heros చిన్న హీరోలు టాప్ హీరోలుగా మారాలంటే సక్సెస్?

Tollywood Heros: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలకి ఉన్న గుర్తింపు చిన్న హీరోలకు ఉండదు… ఎందుకంటే స్టార్ హీరోలు చేసే సినిమాల బడ్జెట్ గాని, వాళ్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ… అందువల్ల వాళ్ళతో భారీ బడ్జెట్ సినిమాలను చేసిన కూడా ఆ కలెక్షన్స్ ద్వారా వాళ్ళు పెట్టిన బడ్జెట్ మొత్తం రికవరీ అవుతుందనే ఉద్దేశ్యంతోనే స్టార్ ప్రొడ్యూసర్లు సైతం స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక వాళ్లకు ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్స్ కూడా ఇస్తారు. అయితే స్టార్ హీరో వరుసగా మూడు, నాలుగు డిజాస్టర్ సినిమాలను తీసిన కూడా వాళ్ళ స్టార్ డమ్ అనేది తగ్గకుండా చసుకుంటారు… ఇంతకు ముందు సినిమా ఎంత బడ్జెట్ తో అయితే చేశారో ఆ తర్వాత చేయబోతున్న సినిమా అంతకు మించిన బడ్జెట్ తో చేసి సక్సెస్ ని సాధించాలని చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ అభిమానులు సైతం తమ హీరో నుంచి వచ్చే సినిమాని ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతో ఒకటికి రెండుసార్లు ఆ సినిమాని చూసి కలెక్షన్స్ ని పెంచే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు… నిజానికి ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అనేవారు ఉన్నారా? లేదంటే కావాలనే వాళ్ళను స్టార్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి…అసలు స్టార్ హీరో అంటే ఎవరు? ఒక సినిమాని భారీ బడ్జెట్ తో తీసినప్పుడు ఆ బడ్జెట్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చి ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉన్నప్పుడే ఆ హీరో స్టార్ హీరోగా మారతాడు. అలా కాకుండా ఐదు సినిమాలు చేస్తే అందులో ఒక సినిమా సక్సెస్ అయ్యి నాలుగు సినిమాలు ప్లాప్ అయి ప్రొడ్యూసర్స్ కి నష్టాలను మిగిల్చిన వాళ్ళు నిజంగానే స్టార్ హీరోలు అవుతారా?

Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!

ఇక రీసెంట్ గా కొంతమంది చిన్న హీరోలు సైతం వరుస గా సక్సెస్ లను సాధిస్తున్నారు. అయినప్పటికి వాళ్ళు స్టార్ హీరో రేంజ్ ను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే ఉంటే సరిపోదు. అంతకు మించిన బ్యాక్ గ్రౌండ్ ఉండాలి అలా ఉన్నప్పుడే ఆ హీరోకి భారీ పబ్లిసిటీ వస్తోంది. ఇక ఆ ఫ్యామిలీకి ముందు నుంచి చాలామంది అభిమానులు ఉంటారు కాబట్టి ఆ అభిమానులు ఈతరం హీరోలను కూడా ఆదరిస్తూ ఉంటారు. వాళ్ళు సినిమాలు ఆడిన ఆడకపోయినా కూడా వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తారు.

కాబట్టి సోలోగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు చేసుకుంటున్న నటులు స్టార్ హీరోలుగా ఎదగాలంటే మాత్రం ఈ రోజుల్లో చాలా కష్టమనే చెప్పాలి. ఇక సక్సెస్ లు ఎన్నిచ్చినా కూడా వాళ్ళ రేంజ్ మాత్రం టైర్ 2 హీరో గానే ఉండిపోతోంది… అలాకాకుండా సక్సెస్ లను బట్టి ఎవరు స్టార్ హీరో అనేది అంచనా వేస్తే బాగుంటుంది. అలాగే 10 కోట్లతో ఒక సినిమా చేస్తే 20 కోట్లు వసూలు చేసింది అంటే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయినట్టే, కాబట్టి చిన్న హీరో కూడా స్టార్ హీరోగా మారినట్టే కానీ మన స్టార్ హీరోలు మాత్రం అది ఒప్పుకోరు…

ఇక 300 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా చేసి కేవలం 100 కోట్ల కలెక్షన్స్ ను మాత్రమే వసూలుచేసి డిజాస్టర్ మారిన కూడా మన స్టార్ హీరోలు వాళ్ళు స్టార్లు గానే ఫీల్ అవుతూ ఉంటారు. ప్రొడ్యూసర్స్ కి ఎన్ని నష్టాలు వచ్చినా వాళ్లకు సంబంధం లేదు. వాళ్ళ మార్కెట్ మాత్రం పడిపోకూడదని చూసుకుంటూ ఉంటారు. అందుకే ఫేక్ కలెక్షన్స్ పోస్టర్ వేస్తూ ఉంటారు… మరి ఇలాంటి సందర్భంలోనే ఎవరైతే హిట్ ఇస్తారో వల్లే స్టార్ హీరోలు అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది…

Leave a Comment