Tollywood Film Workers Strike: సినీ కార్మికుల సమ్మె ను సీఎం దగ్గరికి తీసుకెళ్లి తప్పు చేశారా..? ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు..?

Tollywood Film Workers Strike: గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీ లో పనిచేస్తున్న సినీ కార్మికులు షూటింగ్లను బంద్ చేసి సమ్మె ను నిర్వహిస్తున్నారు. ఇక తమకు రోజువారిగా ఇచ్చే వేతనాలను పెంచాలని వాళ్లు ఈ సమ్మెకు దిగారు. సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే డబ్బులు వాళ్లకు ఏ మూలన సరిపోవడం లేదని అందువల్లే ఇప్పుడున్న వేతనాలకు 30% పెంచి ఇవ్వాలని, అలా ఇస్తేనే మేము షూటింగ్ లకు వస్తామని లేకపోతే లేదంటూ తెగేసి చెప్పడమే కాకుండా గత 20 రోజువా నుంచి షూటింగ్ లు జరగనివ్వకుండా ఒక సమ్మె అయితే చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ సమ్మె కు సంబంధించిన విషయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే ఆయన దృష్టికి వచ్చిన ఈ సమ్మె విషయంలో ఆయన సినీ కార్మికుల వైపే నిలబడ్డాడు. కారణం ఏదైనా కూడా సినీ కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్ల మీద ఉందని, వాళ్ళు బాగుంటేనే సినిమాలు బాగుంటాయని తద్వారా ఇండస్ట్రీ బాగుపడుతుందని చెప్పాడు. ఇక మొత్తానికైతే సీఎం దగ్గరికి వెళ్లకుండానే సామరస్యంగా ప్రొడ్యూసర్లు ఈ విషయాన్ని పరిష్కరించుకుంటే బాగుండేది. వాళ్ళు 30% అడిగినప్పుడు అంత కాదు కానీ ఒక 15% పెంచుతామని ప్రొడ్యూసర్స్ ఒక నిర్ణయం తీసుకుంటే బాగుండేది…అలా చేయకుండా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి వేతనాలు పెంచేది లేదని వీలైతే షూటింగ్లోకి రండి లేకపోతే మానేయండి… కావాలంటే మేము వేరే వాళ్ళని తెచ్చుకొని షూటింగ్ చేసుకుంటాం అంటూ ప్రొడ్యూసర్లు కరాకండి గా చెప్పడంతో వాళ్ళు సీఎంని ఆశ్రయించారు.

ఇక ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో బై ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో సినీ కార్మికులవి 10000 ఓట్లు అయితే ఉన్నాయి. మరి వాటిని క్యాచ్ చేసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సైతం వాళ్ళ వైపే నిలబడ్డాడు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్న చిన్న ప్రొడ్యూసర్లు భారీగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఇక రీసెంట్ గా సీఎం తో జరిగిన మీటింగ్లో ఈ విషయం ఒక కొలిక్కి వచ్చినట్టుగా తెలుస్తోంది.

మరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి ప్రొడ్యూసర్లందరూ కట్టుబడి ఉంటారా చిన్న ప్రొడ్యూసర్ల మీద దీని వల్ల భారీగా భారం పడే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి…ఇక మొత్తానికైతే ఇదంతా చూసిన వాళ్లు సైతం ముందుగానే సినీ కార్మికులకు 10% లేదా 15% పెంచి సెటిల్ చేసుకుంటే అయిపోయేది.

ఇప్పుడు అనవసరంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్లిన తర్వాత ఆయన ఎంత చెప్తే పర్సెంట్ పెంచాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు బై యాక్షన్ ఉన్న నేపథ్యం లో సీఎం రేవంత్ రెడ్డి సైతం దీనిని ఊరికే వదిలేసే అవకాశాలైతే లేవు. ఎందుకంటే రాబోయే ఎలక్షన్స్ లో వాళ్ల ఓట్ల కీలకంగా మారబోతున్నాయి. కాబట్టి ఈ సినీ కార్మికులను తన వైపు తిప్పుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని ఆయన కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది…

Leave a Comment