Telugu Top Directors: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో వారానికి ఒక పెద్ద సినిమా వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉండేది…చాలామంది స్టార్ హీరోలు సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సినిమాల వరకు రిలీజ్ చేసేవారు. దీనివల్ల ఇండస్ట్రీకి రెవెన్యూ ఎక్కువగా జనరేట్ అయ్యేది. సినీ కార్మికులకు సైతం చేతినిండా రోజు పని దొరికేది… ఇప్పుడు అలా కాకుండా స్టార్ట్ డైరెక్టర్లందరు కలిసి ఒక హీరోని లాక్ చేసి రెండు మూడు సంవత్సరాలు ఒక సినిమానే చేస్తూ ముందుకు సాగుతున్నారు. దీనివల్ల సినిమా క్వాలిటీ అయితే పెరిగింది. కానీ దాన్ని నమ్ముకొని బతుకుతున్న సినీ కార్మికులకు అవకాశాలు పెద్దగా రావడం లేదు. ప్రేక్షకులు సైతం వాళ్ళ అభిమాన హీరోలను రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి థియేటర్ లో చూడాల్సిన అవసరమైతే ఏర్పడుతోంది. దీనివల్ల వాళ్ళ అభిమాన హీరో కోసం వాళ్ళు ఈగరుగా వెయిట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలా కాకుండా సినిమాలని కొంచెం తొందరగా చేస్తే ఇండస్ట్రీ కూడా బాగుపడుతోంది. ఇక దానికి తోడుగా రాజమౌళి బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి విజువల్ వండర్స్ ని తెరకెక్కించిన తర్వాత 100 రూపాయల టికెట్ మీద ప్రేక్షకుడు బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలను చూడాలనుకుంటున్నాడు గాని చిన్న సినిమాని చూడడానికి ఏ ఒక్క ప్రేక్షకుడు కూడా ఆసక్తిని చూపించడం లేదు. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి భారీ నష్టం అయితే వాటిల్లుతుంది. ఇక దీనికి చెక్ పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు చిన్న సినిమాలను కూడా చేయాలి. అలాంటప్పుడే చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. చిన్న ప్రొడ్యూసర్లు కూడా మరికొన్ని ఎక్కువ సినిమాలను చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక స్టార్ హీరోలు సైతం అప్పుడప్పుడు చిన్న సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగితేనే ఇండస్ట్రీ పది కాలాలపాటు బాగుంటుంది…
లేకపోతే మాత్రం చిన్న ప్రొడ్యూసర్లు అనేవారు ఇక మీదట సినిమాలు చేసే అవకాశాలైతే లేకుండా పోతాయి. ఎందుకంటే చిన్న సినిమాలను బతికించుకోలేని పరిస్థితిలో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లు సైతం మూత పడిపోతున్నాయి. మొత్తం మల్టీప్లెక్స్ లోనే సినిమాలను ఆడించే పరిస్థితులైతే ఎదురవుతున్నాయి. ఇక దానికి తోడుగా ఓటిటి సైతం భారీ రేంజ్ లో విజృంభిస్తోంది.
Also Read: అనుష్క కెరియర్ ను స్పాయిల్ చేసింది ఎవరు..? ఆమెందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు..?
ఒక సినిమా రిలీజ్ డేట్ ని ఓటిటి సంస్థ నిర్ణయిస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీకి ఇది ఒక భారీ అవమానమనే చెప్పాలి. మహా అయితే ఓటిటి వచ్చి ఒక 10 సంవత్సరాలు కూడా కావడం లేదు. ఇప్పుడే అది సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోయింది అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్లు ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు.
దీనికి అంతటికి కారణం హీరోలు, దర్శకులు మాత్రమే వాళ్ళు వాళ్ళ రెమ్యూనరేషన్ తగ్గించుకొని చిన్న సినిమాలను చేయాలి. అలాంటప్పుడే సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు కూడా బతుకుతాయి. దానికి తోడుగా ఎక్కువ సినిమాలను రిలీజ్ చేయగలిగితే సింగిల్ థియేటర్లు కూడా మూతపడకుండా సంవత్సర కాలం పాటు కళకళలాడుతూ ఉంటాయి. ఇదంతా జరగాలంటే స్టార్ డైరెక్టర్లు, హీరోలు ప్రస్తుతం వాళ్లు అనుసరిస్తున్న పంథా ను మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది…