SleepTips: ఈ విటమిన్ లోపం ఉంటే నిద్ర పట్టదు గాక పట్టదు.. వీటిని ఇలా భర్తీ చేయండి.. – Telugu News | Battling Sleeplessness? Your Vitamin Deficiency Might Be the Cause Details In Telugu

చాలామందికి నిద్రలేమి ఒక పెద్ద సమస్యగా మారింది. కొందరు గంటల తరబడి పడుకున్నా నిద్ర పట్టదు, మరికొందరికి పదేపదే మెలకువ వస్తుంది. ఈ సమస్యకు చాలామంది ఒత్తిడి, అలసట కారణమని భావిస్తారు. కానీ, దీనికి మరో ప్రధాన కారణం శరీరంలో కొన్ని విటమిన్ల లోపం. వైద్య నిపుణుల ప్రకారం, మంచి, గాఢమైన నిద్రకు కేవలం సుఖవంతమైన పరుపు మాత్రమే కాదు, సరైన పోషణ కూడా ముఖ్యం. కొన్ని పోషకాల లోపం వల్ల నిద్ర చక్రాన్ని నియంత్రించే వ్యవస్థ దెబ్బతింటుంది.

మంచి నిద్రకు అవసరమైనవి:

విటమిన్ డి: ఈ విటమిన్ మన నిద్ర చక్రాన్ని నియంత్రిస్తుంది. దీని లోపం వల్ల అలసట, నిద్రలేమి సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా, ఎండ తక్కువగా తగిలేవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.

విటమిన్ బి12: ఇది మెదడు, నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. దీని లోపం వల్ల నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ హార్మోన్ సమతుల్యత దెబ్బతింటుంది. దాంతో నిద్ర పట్టడం ఆలస్యం అవుతుంది.

మెగ్నీషియం: ఇది విటమిన్ కాకపోయినా, నిద్రతో దీనికి దగ్గర సంబంధం ఉంది. మెగ్నీషియం మెదడును శాంతపరుస్తుంది, కండరాలను రిలాక్స్ చేస్తుంది. దీని లోపం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది.

లోపాన్ని ఎలా పూరించాలి?

విటమిన్ డి కోసం ప్రతిరోజు 20 నిమిషాలు ఎండలో నిలబడండి. పాలు, గుడ్లు, పుట్టగొడుగులు తినండి.

విటమిన్ బి12 కోసం పెరుగు, పాలు, గుడ్లు, చేపలు, ఆకుకూరలు తీసుకోండి.

మెగ్నీషియం కోసం బాదం, అక్రోట్ లాంటి డ్రై ఫ్రూట్స్, అరటిపండు, ఆకుకూరలు, పప్పులు తినండి.

అవసరం అయితే డాక్టర్ సలహా మీద సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

[

Leave a Comment