Prabhas Raja Saab Updates: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినిమాను చేసిన ఆయన ఆ తర్వాత చేసిన ప్రతి సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.ఇక సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ వరుస సక్సెస్ లను సాధించిన ఆయన రాజాసాబ్ సినిమాతో మరోసారి మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది… డిసెంబర్ 5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ సినిమాని ప్రభాస్ తో కాకుండా వేరే హీరోతో చేసి ఉంటే బాగుండేదని చాలా మంది సినిమా మేధావులు సైతం ప్రస్తుతం కామెంట్స్ అయితే చేస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే ఈ కథ చాలా చిన్న కథగా తెలుస్తోంది. మరి ఇలాంటి స్టోరీలు చేయడం వల్ల ఆయన ఇమేజ్ కొంతవరకు తగ్గే అవకాశాలైతే ఉన్నాయని, ఆయన భారీ ప్రాజెక్టులను చేస్తూ వేల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతున్నాడు.
మరి అలాంటి ప్రభాస్ ఇప్పుడు ఒక దెయ్యం కథతో సినిమా చేయడం పట్ల పలువురు పెద్దగా ఆసక్తి అయితే చూపించడం లేదు. అదే ఒక మీడియం రేంజ్ హీరోతో చేసినట్లయితే ఈ సినిమాకి భారీ హైప్ వచ్చేది. సినిమా కూడా సూపర్ హిట్ అవ్వడానికి అవకాశం ఉండేది. బడ్జెట్ కూడా ఈ రేంజ్ లో అయ్యేది కాదు. దానివల్ల సినిమా సేఫ్ జోన్ లో ఉండేది.
Also Read: తెలుగు సినిమా బ్రతకాలి అంటే స్టార్ డైరెక్టర్లు ఈ ఒక్క పని చేయాల్సిందేనా..?
ఇక ఇప్పుడు ప్రభాస్ నుంచి కల్కి లాంటి ఒక విజువల్ వండర్ లాంటి సినిమా వచ్చిన తర్వాత రాజాసాబ్ సినిమాని ప్రేక్షకూ పట్టించుకునే అవకాశం అయితే లేదు. మరి ఇలాంటి సందర్భంలో సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇలాంటి చిన్న సబ్జెక్టులను మీడియం రేంజ్ హీరోలతో చేస్తేనే వర్కౌట్ అవుతోంది.
అలా కాకుండా స్టార్ హీరోతో చేయాలి అనుకుంటే మాత్రం అతని అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఈ మూవీ మీద భారీ ఆశలు పెట్టుకుంటారు. దానివల్ల సినిమా తేడా కొట్టే అవకాశాలైతే ఉన్నాయి. ఇక శర్వానంద్ లాంటి హీరోతో ఈ సినిమా చేసి ఉంటే బాగా వర్కౌట్ అయ్యేదని, నిజానికి ముందుగా శర్వానంద్ కోసమే ఈ సినిమాని అనుకున్నారట. కానీ ప్రభాస్ తను చేస్తానని చెప్పడంతోనే మారుతి ఈ మూవీని ప్రభాస్ తో చేస్తున్నారని పలువురు సినిమా మేధావులు కామెంట్స్ చేస్తుండటం విశేషం…