
దిశ, బిజినెస్ బ్యూరో: గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ భారత మార్కెట్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో తన అన్ని ఐఫోన్ 17 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల అసెంబ్లీని దేశీయంగా చేపడుతున్నట్టు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. దేశీయంగా కంపెనీకి చెందిన ఐదు తయారీ ప్లాంట్లలో వీటి ఉత్పత్తి నిర్వహించనుంది. అందులో రెండు ఇటీవల కొత్తగా కార్యకలాపాలను ప్రారంభించాయి. యాపిల్ సంస్థ ప్రీమియం ప్రో వెర్షన్‌లతో సహా ప్రతి కొత్త ఐఫోన్ వేరియంట్‌ను భారత్‌లో తయారు చేయడం ఇదే మొదటిసారి. అమెరికాకు సరఫరా అయ్యే ఐఫోన్‌ల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి, టారిఫ్ ప్రభావం నుంచి బయట పడేందుకు యాపిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికే అమెరికన్ మార్కెట్ కోసం ఐఫోన్ ఉత్పత్తిలో అత్యధిక వాటాను చైనా నుంచి భారత్‌కు మార్చింది. దీన్ని మరింత పెంచేందుకు తమిళనాడులో హోసూర్‌లో ఉన్న టాటా గ్రూప్ ప్లాంట్, బెంగళూరు సమీపంలో ఉన్న రెండు ఫాక్స్‌కాన్ హబ్ ఐఫోన్ ఉత్పత్తికి కీలక కేంద్రాలుగా ఉన్నాయని బ్లూమ్‌బర్గ్ తెలిపింది.