Flipkart: మెరుగైన షాపింగ్ కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ తీసుకొచ్చిన ఎస్‌బిఐ కార్డ్, ఫ్లిప్‌కార్ట్

Flipkart: మెరుగైన షాపింగ్ కోసం కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ తీసుకొచ్చిన ఎస్‌బిఐ కార్డ్, ఫ్లిప్‌కార్ట్

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వ రంగ ఎస్‌బీఐ కార్డ్‌, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కీలక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించాయి. కస్టమర్ల షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మరింత సౌకర్యంగా ఉండేందుకు, వివిధ ప్రయోజనాలు, రివార్డులు, అనేక ఫీచర్లతో కూడిన కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును తీసుకొచ్చినట్టు వెల్లడించింది. మంగళవారం ‘ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు’ను ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి, ఎండీ అశ్విని కుమార్ తివారీ సమక్షంలో ప్రారంభించారు. ఇరు సంస్థలు సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ కార్డు ద్వారా వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌తో పాటు అనేక ప్రయోజనాలు లభిస్తాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ కార్డును ఉపయోగించి కస్టమర్లు మింత్రాలో చేసే కొనుగోళ్లపై 7.5 శాతం క్యాష్‌బ్యాక్‌ను, ఫ్లిప్‌కర్ట్, షాప్సీ, క్లియర్‌టిప్‌లలో చేసే ఖర్చులపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. జొమాటో, ఉబర్, నెట్‌మెడ్స్, పీవీఆర్‌లలో 4 శాతం క్యాష్‌బ్యాక్, అంతర్జాతీయ లావాదేవీల రుసుముపై 3.5 శాతం రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, ఫర్నీచర్, గృహోపకరణాలు, ట్రావెల్ బుకింగ్‌లు సహా ఫ్లిప్‌కార్ట్‌లో లభించే అనేక ఉత్పత్తులు సేవలపై రాయితీలను పొందవచ్చని పేర్కొంది.

Leave a Comment