Delhi metro Women fight: మెట్రో నగరాల్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికి, ప్రజలకు సురక్షితమైన ప్రయాణం కోసం ప్రభుత్వం మెట్రో రైళ్లు ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఈ మెట్రో రైళ్లు రీల్స్ చేయడానికి, డ్యాన్స్‌లు చేయడానికి వేగికగా మారుతున్నాయి. తాజాగా ఫైటింగ్‌లు కూడా జరుగుతున్నాయి. ఆర్టీసీలో మహిళకు ఫ్రీ జర్నీతో మహిళలు సీట్ల కోసం కొట్టుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియో నెట్టింట్లో చెక్కర్లు కొడుతోంది. సీటు విషయంలో ఇద్దరు యువతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ గొడవ భౌతక దాడి వరకు వెళ్లింది. ఇద్దరూ ఒకరి జుట్టు లాగుకుంటూ, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. రైల్లో సరిపడా స్థలం ఉన్నప్పటికీ, ఈ వివాదం ఎందుకు జరిగిందనేది స్పష్టంగా తెలియలేదు.
వివాదాల కేంద్రంగా..
ఢిల్లీ మెట్రో గత కొంతకాలంగా ఇలాంటి అసభ్యకర ఘటనలకు, గొడవలకు కేంద్రంగా మారుతోంది. ప్రయాణికుల మధ్య వాగ్వాదాలు, గొడవలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, మెట్రోలో ప్రయాణికుల ప్రవర్తన, భద్రతా చర్యలపై చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఇద్దరు యువతులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు విభిన్న రీతుల్లో స్పందించారు. కొందరు ’ఢిల్లీ మెట్రో ఎప్పుడూ నిరాశపరచదు’ అంటూ హాస్యాస్పదంగా స్పందిస్తుండగా, మరికొందరు ఈ ఘటనలను ’వినోదాత్మకం’గా అభివర్ణించారు. అయితే, ఇలాంటి ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వినోదంగా కనిపించినప్పటికీ, ఇవి సమాజంలో సహనం, సభ్యతలు తగ్గుతున్నాయనే ఆందోళనను కలిగిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు మెట్రోలో భద్రతా చర్యలు, ప్రయాణికుల ప్రవర్తన నియంత్రణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సీటు విషయంలో చిన్న వివాదం శారీరక దాడి వరకు ఎందుకు వెళ్లిందనేది ఆలోచించాల్సిన విషయం. మెట్రో అధికారులు ఇలాంటి ఘటనలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో, ప్రయాణికులు కూడా సహనం, సహకారంతో ప్రవర్తించడం ద్వారా ప్రజా రవాణా వ్యవస్థను మరింత సౌకర్యవంతంగా మార్చడంలో భాగస్వాములు కావాలి.
మెట్రోలో జుట్లు పట్టుకుని కొట్టుకున్న యువతులు
ఫైట్స్, అసభ్యకర ఘటనలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్ అడ్రస్ గా మారింది. తాజాగా రైల్లో ఇద్దరు యువతులు సీటు విషయంలో గొడవ పడ్డారు.
జుట్లు లాక్కుంటూ, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. #DelhiMetro pic.twitter.com/ZM3ZwLa7Iu
— (@TEAM_CBN1) August 26, 2025