AP Liquor Scam Case: ఏపీలో( Andhra Pradesh) మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టించింది. వైసిపి హయాంలో దాదాపు 18 వేల కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ నిర్ణయాలు తీసుకున్నారు నాటి పాలకులు. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది. కానీ మద్యం సరఫరా చేసే డిస్టలరీలను, సంస్థలను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని నాటి పాలకులు మద్యం కుంభకోణానికి తెరతీసారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపట్టింది. ప్రధానంగా 40 మంది నిందితులను గుర్తించి కేసులు నమోదు చేసింది. ఓ 12 మందిని కూడా అరెస్టు చేసింది. వైసీపీ పార్టీలో, ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తులే ఇప్పుడు అరెస్టు కావడం సంచలనంగా మారింది. ఫైనల్ గా అంతిమ లబ్ధిదారుడు ఎవరు అన్నది ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చనుంది. షిఫ్ట్ ఇప్పటికే రెండు చార్జ్ షీట్లు కోర్టులో దాఖలు చేసింది. త్వరలో కీలక అరెస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు బయలు ఇవ్వొద్దని.. మద్యం కుంభకోణం కేసులో ఆయనే కీలక నిందితుడని.. ముడుపుల చేరవేతలో సిద్ధహస్తుడని ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టుకు స్పష్టం చేసింది.
Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!
* ఎమ్మెల్యేగా, తుడా చైర్మన్ గా
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి( Chevireddy Bhaskar Reddy ) చంద్రగిరి ఎమ్మెల్యే గారు వ్యవహరించారు. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా నామినేటెడ్ పదవిలో కొనసాగారు. 2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో ఆయన కుమారుడు చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఒంగోలు పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి చవి చూశారు. అప్పటివరకు ఒంగోలు పార్లమెంట్ స్థానానికి మా గుంట శ్రీనివాసుల రెడ్డి ఎంపీగా ఉండేవారు. అయితే ఆయన ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థి అయ్యారు. ఆయనకు ఢీ కొట్టాలంటే సమర్థవంతమైన నేత అవసరమని భావించి చెవిరెడ్డిని ప్రయోగించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నిత్యం జగన్ వెంట ఉండేవారు చెవిరెడ్డి. అంతకు ముందు కూడా వైసిపి హయాంలో చంద్రగిరి కంటే.. తాడేపల్లి లోనే ఎక్కువగా గడిపేవారు. అయితే అప్పట్లో మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన ముడుపులను చేరవేసే బాధ్యతను చెవిరెడ్డి తీసుకున్నారని సిట్ విచారణలో తేల్చింది. అందుకే ఆయన అరెస్టయ్యారు.
* బెయిల్ పై అభ్యంతరాలు..
మద్యం కుంభకోణం( liquor scam ) కేసులో రాజ్ కసిరెడ్డి సూత్రధారి. మొత్తం ఆయన ద్వారానే మద్యం కుంభకోణం జరిపించారు. డిష్టలరీలతో పాటు మద్యం కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యేవారు రాజ్ కసిరెడ్డి. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి బాహటంగానే చెప్పారు. అయితే అప్పటి సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. తరచూ సమావేశాలు నిర్వహించేవారు. ఎవరి వాటాలు వారు పట్టుకుని వెళ్లేవారు అని సీట్ గుర్తించింది. అదే విషయాన్ని చార్జ్ షీట్ వేసిన సందర్భంలో కూడా ప్రస్తావించింది. అయితే అందరికీ మించి ఈ ముడుపులను చేరవేయడంలో మాత్రం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ చెబుతోంది. తాజాగా ఆయన తాను వెన్ను నొప్పితో బాధపడుతున్నానని.. చికిత్స కోసం బెయిల్ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేశారు. కానీ సిట్ మాత్రం ఈ మద్యం కుంభకోణంలో ముడుపులను చేరవేసింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని.. నాటి తుడా వాహనాల్లోనే ఈ తరలింపు జరిగిందని కూడా చెబుతోంది. అందుకే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదని కోరింది. దీంతో ఈ కేసును వాయిదా వేశారు న్యాయమూర్తి. చూడాలి మరి ఏం జరుగుతుందో.