AP Free Bus Travel: ఏపీలో ఉచిత ప్రయాణంలో మరో అప్డేట్.. చంద్రబాబు కీలక ఆదేశాలు

AP Free Bus Travel: ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీలో( APSRTC ) ఉచిత ప్రయాణ పథకం అమలవుతోంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ప్రతి కుటుంబం లబ్ధి పొందేలా ఈ పథకం రూపొందించినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఆగస్టు 15న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చింది. రోజుకు సగటున 21 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ పథకం అమలు చేసి పది రోజులు అవుతున్న తరుణంలో లోటుపాట్లు తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ఆక్యుఫెన్సీ రేషియో ఎంత మేర పెరిగిందనే దానిపై ఆరా తీశారు.

Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!

* కీలక సమీక్ష..
అయితే ప్రారంభంలో చిన్నపాటి గందరగోళం తప్ప.. ఈ పథకం సక్సెస్ కావడంపై ప్రభుత్వ వర్గాలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కీలక సమీక్షలో చంద్రబాబు( CM Chandrababu) అధికారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. స్త్రీ శక్తి పథకం కింద నడిపే ఆర్టీసీ బస్సులకు.. ముందు, వెనుక రెండు వైపులా బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద 8458 బస్సులు నడుస్తుండగా.. వాటన్నింటికి రెండు వైపులా బోర్డు పెట్టాలని సూచించారు సీఎం చంద్రబాబు. మహిళలు బస్సుల్లో సీట్ల కోసం పోటీ పడితే ఆర్టీసీ సిబ్బంది సంయమనంతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దాలన్నారు. ఆర్టీసీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

* పెరిగిన ఆక్యుపెన్సి రేషియో
శ్రీ శక్తి పథకం ( Stri Shakti scheme ) అమల్లోకి వచ్చి పది రోజులు అవుతున్న తరుణంలో ఎదురైన లోటుపాట్లు, ఇతరత్రా విషయాలను సీఎం చంద్రబాబుకు వివరించారు ఆర్టీసీ ఉన్నతాధికారులు. ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు బస్సుల్లో 40 శాతం మంది మహిళలు.. 60 శాతం మంది పురుషులు ప్రయాణించే వారట. కానీ ఇప్పుడు 65% మేర మహిళలు, 35 శాతం మేర పురుషులు ప్రయాణిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఉచిత బస్సు పథకం అమలు తర్వాత బస్సులలో ఆక్యుపెన్సి రేషియో పెరిగిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుఫెన్సీ రేషియో ఉంటుందని చెప్పుకొచ్చారు.

* లైవ్ ట్రాకింగ్ విధానం పై చర్చ..
ఆర్టీసీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్ ( live tracking)విధానం పై చర్చించారు ఈ సమావేశంలో. పైలెట్ ప్రాజెక్టు కింద గుంటూరు డిపోలోని బస్సులలో లైవ్ ట్రాకింగ్ విధానాన్ని చేపడతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అటు తరువాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని.. అన్ని బస్సులలో లైవ్ ట్రాకింగ్ విధానం పెడతామని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ లైవ్ ట్రాకింగ్ విధానం అమల్లోకి వస్తే బస్సుల కోసం వేచి చూడాల్సిన పని ఉండదు. బస్సుల వేళలు తెలుసుకొని.. ముందుగానే ప్రయాణ షెడ్యూల్ ఖరారు చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. మొత్తానికి అయితే ఏపీలో స్త్రీ శక్తి పథకం పది రోజుల పాటు విజయవంతంగా పూర్తయింది. దీనిపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment