Andhra News: పట్టుచీరపై బొమ్మ నేసి.. మంత్రిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్న చేనేత కార్మికుడు! – Telugu News | Handloom Worker Ravindra Weaves Andhra Pradesh Minister Savitha”s Portrait on Silk Saree

ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ బొమ్మను.. పట్టుచీర పై నేసి ఓ చేనేత కార్మికుడు తన అభిమానాన్ని చాటుకున్నాడు. శ్రీ సత్య సాయి జిల్లా సోమందేపల్లికి చెందిన రవీంద్ర అనే నేతన్న మంత్రి కవితమ్మ మీద ఉన్న అభిమానంతో ఆమె బొమ్మను పట్టుచీరపై నేశాడు. దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ధర్మవరం నుంచి ముడి సరుకు తీసుకొచ్చి. పవర్ లూమ్ ( మర మగ్గం)పై దాదాపు వారం రోజులుగా చేనేత కార్మికుడు రవీంద్ర మంత్రి సవితమ్మ బొమ్మను పట్టుచీరపై నేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా. మంత్రి సవిత బొమ్మ పట్టు చీరపైన నేయడం చాలా ఆనందంగా ఉంది అంటున్నారు చేనేత కార్మికుడు రవీంద్ర. వినాయక చవితి పండుగ సందర్భంగా ఆ పట్టు చీరను మంత్రి సవితమ్మకు అందజేయాలని ఉద్దేశంతోనే… మంత్రిపై ఉన్న అభిమానంతో పట్టుచీరపై సవితమ్మ బొమ్మ నేసినట్లు రవీంద్ర చెబుతున్నారు. వినాయక చవితి పండుగ రోజు మంత్రి సవితమ్మకు ఆ చీరను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నట్లు చేనేత కార్మికుడు రవీంద్ర తెలిపారు. చేనేత కార్మికుడి కష్టం మంత్రి సవితమ్మపై తనకున్న అభిమానాన్ని చీరపై మంత్రి బొమ్మ వేసి చాటుకున్న విధానాన్ని చూసి స్థానికులు నేతన్న రవీంద్రను అభినందిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment