
దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు బిహార్లో ఏం పని? ఎన్నికల సమయంలో బిహార్ ప్రజలను అవమానించేలా మాట్లాడారు. ఇప్పుడు అదే బిహార్(Bihar) ప్రజలను ఓట్లు అడగడానికి వచ్చారు. రేవంత్ గ్రామాల్లోకి వచ్చి ఉంటే కర్రలు తీసుకుని తరిమేవాళ్లు. బిహార్‌ను అవమానించడం కాంగ్రెస్ నేతలకు మొదటి నుంచీ అలవాటే. ఇది రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది’ అని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ అంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీని విమర్శిస్తున్నారని, తప్పుడు ఆరోపణలంటూ మోడీ.. రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని, అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మల్లించేందుకు ఇద్దరు ఈ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.