Dhee 20 Pandu Master: ప్రస్తుతం ఈటీవీ ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో దూసుకుపోతున్న షో ఏదైనా ఉందా అంటే అది ‘ఢీ 20′(Dhee 20) షో అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ముందు సీజన్స్ లో లాగా కాకుండా ఈ సీజన్ లో అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు కంటెస్టెంట్స్. ముందు సీజన్స్ లో టాప్ 5 వరకు వచ్చిన వాళ్ళు, టైటిల్ గెలిచిన వాళ్ళు మొత్తం ఈ సీజన్ లో ఉండడం తో డ్యాన్స్ షో చాలా కలర్ ఫుల్ గా సాగుతుంది. ఇకపోతే ఈ షో లో అందరికంటే బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్ పండు మాస్టర్(Pandu Master). దాదాపుగా అన్ని సీజన్స్ లో ఆయన కంటెస్టెంట్ గా పాల్గొంటున్నాడు. కానీ ఒక్క సీజన్ లో కూడా టైటిల్ గెలవలేదు. ఆ ఎమోషన్ తో ఆయన ఈ సీజన్ లో కామెడీ చెయ్యడమే కాకుండా, అద్భుతంగా డ్యాన్స్ కూడా చేస్తున్నాడు.
Also Read: నష్టాల్లో ‘కంగువ’ రికార్డుని బద్దలు కొట్టిన ‘వార్ 2’..టాప్ 5 లిస్ట్ ఏంటంటే!
ఆయన వేస్తున్న డ్యాన్స్ లో కసి కనిపిస్తుంది. ‘ఈ సాలా కప్ నామదే’ అనేది కేవలం కామెడీ కోసమే కాదు, నిజంగానే కప్ కొట్టే రేంజ్ లో ఆయన డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఈమధ్య కాలం లో ఉంటున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గానే ఆయన వేసిన ‘ఇటుక మీద ఇటుక’ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనమంతా చూసాము. యూట్యూబ్ లో ఈ పాటకు అప్పుడే కోటి కి పైగా వ్యూస్ వచ్చాయి. అలా ఆయన ఈ షోలో చేస్తున్న ప్రతీ పెర్ఫార్మన్స్ బ్లాస్టింగ్ రేంజ్ లోనే ఉంటున్నాయి. అయితే అలాంటి పండు ఇప్పుడు ‘ఢీ 20’ షో వదిలేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. కారణం ఏమిటంటే సెప్టెంబర్ 7 నుండి స్టార్ మా ఛానల్ లో ‘బిగ్ బాస్ 9’ మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనాల్సిందిగా పండు ని బిగ్ బాస్ యాజమాన్యం అడిగారట. ఆయన రావడానికి ఇంకా ఒప్పుకోలేదు కానీ, అలా అని నో కూడా చెప్పలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఈ సీజన్ మొదలైన నాలుగు వారాల తర్వాత వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా పండుని లోపలకు పంపాలని బిగ్ బాస్ టీం అనుకుంటున్నారట. అప్పటి లోపు ప్రస్తుతం ఆయన చేస్తున్న డీ 20 షో కూడా అయిపోయే అవకాశం ఉండడం తో వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నాడట పండు మాస్టర్. ఒకవేళ అప్పటి వరకు డీ 20 షో అవ్వకపోయిన కూడా మధ్య వదిలేసి వెళ్తే ఎలా ఉంటుంది అని కూడా ఆలోచిస్తున్నాడట. బిగ్ బాస్ ఆఫర్ ప్రస్తుతానికి మాత్రం ఆయన కెరీర్ కి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.