
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే టీజీ పీఈసెట్ 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించి ఫైనల్ ఫేజ్ షెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను టీజీపీఈ సెట్ అడ్మిషన్స్ 2025 కన్వీనర్ ప్రొఫెసర్ జె. పాండురంగారెడ్డి విడుదల చేశారు. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 26 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు కన్వినర్ తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను tgcetsadms@gmail.com ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఏవైనా సందేహాలకు 9885622266 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
ఫైనల్ ఫేజ్ షెడ్యూల్:
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్: ఆగస్టు 26 నుండి 29 వరకు
అర్హత కలిగిన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: ఆగస్టు 30
వెబ్ ఆప్షన్స్ : ఆగస్టు 30, 31
వెబ్ ఆప్షన్స్ ఎడిట్: సెప్టెంబర్ 1
ఎంపికైన అభ్యర్థుల జాబితా విడుదల: సెప్టెంబర్ 3
ట్యూషన్ ఫీజు చెల్లింపు: సెప్టెంబర్ 4 నుండి 8 వరకు.