జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి..?

జానీ మాస్టర్ మాజీ అసిస్టెంట్.. బిగ్‌బాస్ హౌస్‌లోకి..?

జానీ మాస్టర్ వద్ద అసిస్టెంట్‌గా పని చేసిన శ్రేష్ఠి (Shrasti Verma) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఆమె.. ఆయన జైలుకు వెళ్లేందుకు కారణమైంది. అప్పట్లో ఈ విషయం తీవ్ర దుమారం రేపింది. జానీ మాస్టర్ కొన్నిరోజులు జైల్‌లో ఉండి.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సైలెంట్ అయిపోయింది. జానీ మాస్టర్, శ్రేష్ఠి ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు.

అయితే ఇప్పుడు శ్రేష్ఠి (Shrasti Verma) మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె బిగ్‌బాస్ 9వ సీజన్‌లో కంటెస్టెంట్‌గా వెళ్తుందని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్‌బాస్ టీమ్ ఆమెను సంప్రదించగా.. అందుకు ఆమె ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఈమె కానీ, బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తే ఇంకా రచ్చ రచ్చే అని సోషల్‌మీడియాలో నెటిజన్లు అంటున్నారు. ఇక బిగ్‌బాస్ 9 విషయానికొస్తే.. ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందుకోసం కొందరు సామాన్యులతో అగ్నిపరీక్ష అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ షోకి నవదీప్, అభిజీత్, బింధు మాధవి జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎంపికైన వాళ్లు బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశాన్ని పొందుతారు.

Also Read : ఆలయంలో మహిళ యూట్యూబర్ ఓవరాక్షన్.. అపవిత్రమైందటూ..

Leave a Comment