Chiranjeevi-Srikanth movie T-rex: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉన్నారు. ఒకరిని మించిన సినిమాలు మరొకరు చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నారు. దసర సినిమాతో శ్రీకాంత్ ఓదెల తనకంటూ ఒక స్టార్ డమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ సినిమాతో వచ్చిన సక్సెస్ ని వాడుకుంటూ నానితో మరోసారి ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు…ఇక ఈ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక సినిమా చేయబోతున్నాను అంటూ చెప్పిన విషయం మనకు తెలిసిందే. చిరంజీవి కూడా అఫీషియల్ గా దీన్ని అనౌన్స్ చేశాడు. మరి ఇప్పుడు ఈ సినిమాకి ‘ T Rex’అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ T-Rex అంటే ఏంటి అనే డౌట్ అందరికీ కలుగుతోంది… ‘టైరన్నోసారస్’ అనే ఒక డైనోసార్… ఇక ఇవి నార్మల్ డైనోసార్ లా ఉండవు…అడవిలో ఉండే డైనోసర్ల సమూహానికి రాజులుగా ఉంటాయి. ఒక్కసారి ఇవి వేటకు వచ్చినట్టయితే మాత్రం ఎలాంటి అనర్థాలు జరుగుతాయి అనేది ఎవ్వరు ఊహించుకోలేరు. అలాంటి ఒక టైరన్నోసారస్ అనే డైనోసర్ యొక్క పేరును పెట్టి ఈ సినిమాని చేస్తున్నాడంటే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాని చాలా డెప్త్ గా తీసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ప్యారడైజ్ లో బోల్డ్ డైలాగులను సైతం వాడుతూ చాలా రస్ట్రీక్ గా ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ మూవీ తర్వాత చిరంజీవి తో ఆయన చేసే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా చిరంజీవి బర్త్ డే రోజు కూడా శ్రీకాంత్ స్పెషల్ ట్వీట్ అయితే చేశాడు.
చిరంజీవి చాలా సంవత్సరాల నుంచి తన ఐడెంటిటి కోల్పోయాడని మరోసారి నేను మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేయబోతున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇప్పుడు ఈ సినిమాకి T – Rex టైటిల్ ని ఖరారు చేస్తున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఒకవేళ ఈ టైటిల్ ను నిజంగానే కన్ఫామ్ చేసినట్లయితే మాత్రం ఇక చిరంజీవిని డైనోసర్ మాదిరిగా చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు అనేది మనకు చాలా క్లియర్ గా కనిపిస్తోంది… ఇక ఈ పోస్టర్ వచ్చినప్పటి నుంచి చిరంజీవి అభిమానులు సైతం ఈ మూవీ గురించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి తీవ్రమైన ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి నాని ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే…