ఏళ్ల తరబడి ఒకే కుక్కర్‌ వాడుతున్నారా..? మీ ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది.. జాగ్రత్త! – Telugu News | Side effects of using old aluminium pressure cookers for health

ప్రతి ఇంట్లో వంట కోసం కుక్కర్లను తప్పక ఉపయోగిస్తారు. బియ్యం నుండి పప్పు సాంబార్ వరకు అవి మన వంట పద్ధతిని చాలా సులభతరం చేశాయి. కానీ కొన్నిసార్లు, కుక్కర్లను ఉపయోగించడం మన ఆరోగ్యానికి హానికరం. పాత ప్రెషర్ కుక్కర్లను ఎక్కువ కాలం ఉపయోగించడం చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. పాత కుక్కర్లలో, పాత వంట పాత్రలలో వంట చేయడం ప్రాణాంతకమని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. కుక్కర్‌ను ఎక్కువకాలం ఉపయోగించినప్పుడు అది ప్రాణాంతకంగా మారుతుంది. అదేలాగో మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి..

ఇటీవల ముంబైకి చెందిన 50 ఏళ్ల వ్యక్తి అనారోగ్య సమస్యల కారణంగా మరణించాడు. అతను దాదాపు 20 సంవత్సరాలుగా ఒకే అల్యూమినియం కుక్కర్‌లో వంట చేస్తున్నాడని దర్యాప్తులో తేలింది. అందులోని సీసం అతని శరీరంలోకి ప్రవేశించి ప్రాణాపాయం కలిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.. అల్యూమినియం వంట పాత్రలలో సీసం అనే పదార్థం ఉపయోగించబడుతుంది. కాలక్రమేణా, ఈ పూత అరిగిపోవడం ప్రారంభమవుతుంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఆహారాన్ని వండినప్పుడు కుక్కర్ నుండి సీసం విడుదల అవుతుంది. అందువల్ల, వంట పాత్ర ఉపరితలం అరిగిపోయినప్పుడు, దానిలోని సీసం ఆ పాత్రలోకి చేరుతుంది.

సీసం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది? : కుక్కర్లతో సహా వంట పాత్రలు ఎక్కువసేపు ఉడికించినప్పుడు లేదా పాతవి అయినప్పుడు వాటి పూత చెరిగిపోవడం ప్రారంభమవుతుంది. టమోటాలు, చింతపండు వంటి ఆమ్ల ఆహారాలను ప్రతిరోజూ పాత పాత్రలలో వండినట్లయితే, సీసం, అల్యూమినియం వంటి లోహాలు ఆహారంలో కలిసే అవకాశం ఉందని చెబుతారు. ఇది ఆహారం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

[

Leave a Comment