ఈ వయసులో బోనీ కపూర్ కు ఎందుకింత కష్టం..

Boney Kapoor: హిందీ చిత్ర పరిశ్రమలో పేరు పొందిన నిర్మాతల్లో బోనీ కపూర్ ఒకరు. ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించారు. నిర్మాత కంటే శ్రీదేవి భర్తగా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. శ్రీదేవి మరణం తర్వాత ఆయన తన కూతుర్లు జాన్వి, ఖుషి తో కలసి ముంబైలో నివసిస్తున్నారు. జాన్వి హిందీ, తెలుగు చిత్రాలతో బిజీబిజీగా ఉన్నారు. ఖుషీ కూడా చిత్ర పరిశ్రమలో ప్రవేశించేందుకు అడుగులు వేస్తున్నారు. శ్రీదేవి మరణం తర్వాత బోని కపూర్ డీలా పడిపోయారు. ఆయన ఉన్నట్టుండి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.

Also Read: ఓటీటీ లోకి వచ్చేసిన ‘కింగ్డమ్’ మూవీ..ఎందులో చూడాలంటే!

అప్పుడు స్థలం కొనుగోలు చేశారు

శ్రీదేవి స్వస్థలం చెన్నై. ఆమె కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడు.. 1988లో చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ లో స్థలం కొనుగోలు చేశారు. ఆ స్థలానికి అప్పట్లో అంతగా డిమాండ్ గా ఉండేది కాదు. భవిష్యత్తులో దేనికైనా ఉపయోగపడుతుందని శ్రీదేవి భావించి దానిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆమె బోనీ కపూర్ ను పెళ్లి చేసుకోవడం.. ముంబైలో స్థిరపడడం జరిగిపోయాయి. అయితే ఈ లోగానే ఆ స్థలం ఖాళీగా ఉండడంతో కొంతమంది కన్ను దాని మీద పడింది. ఇంకేముంది గద్దలా మాదిరిగా దాని మీద వాలిపోయారు. ఈ విషయం బోనికపూర్ కు తెలియడంతో ఆయన మద్రాస్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. “నా భార్య ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించి ఆస్థానాన్ని కొనుగోలు చేసింది. ముగ్గురు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించారు. దయచేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ స్థలాన్ని నాకు అప్పగించాలని” సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించిన ఫిర్యాదులో బోనీ కపూర్ పేర్కొన్నారు.

కోర్టును ఆశ్రయించక తప్పలేదు

బోనికపూర్ ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకున్న మద్రాస్ సర్వోన్నత న్యాయస్థానం.. తమిళనాడు రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.. బోనికపూర్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం నాలుగు వారాల్లో విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్ ను ఆదేశించింది. అయితే ఈ స్థలాన్ని శ్రీదేవి ముదలైర్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశారు. అయితే ఆ తర్వాత ఈ భూమి మీద ఎటువంటి కార్యకలాపాలు సాగించకపోవడంతో శ్రీదేవి భూమి కొనుగోలు చేసిన వ్యక్తి కుమారులు.. ఆ స్థలాన్ని ఆక్రమించారు. ఆ తర్వాత ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయని వితండవాదం చేస్తున్నారు. ముదలైర్ కుమారులు స్థలాన్ని ఆక్రమించి.. నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో బోని కపూర్ కోర్టును ఆశ్రయించారు.

Leave a Comment