Viral Video: రన్నింగ్ ట్రైన్‌ ఎక్కబోతూ పట్టాలమీద పడ్డ మహిళ.. తర్వాత ఏమైందంటే?… ఒక నిమిషం సేపు ఆమె మీదుగా ప్రయాణించిన రైలు – Telugu News | Viral video Elderly Woman fell down Railway Tracks While Boarding Moving Train In Kanpur railway station RPF Jawan Comes To Rescue

స్టేషన్‌ నుంచి కదులుతున్న రైలు ఎక్కేందుకు ఒక మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిపోయింది. ఆమె ట్రాక్‌పై పడున్న సమయంలో ఒక నిమిషం పాటు ఆమె మీదుగా రైలు వెళ్లింది. ఆర్పీఎఫ్‌ సిబ్బంది అలెర్ట్‌తో ఆ రైలు ఆగింది. దీంతో ట్రాక్‌ పైన పడిన ఆ మహిళను రక్షించారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

అయోధ్యకు చెందిన 61 ఏళ్ల మహిమా గంగ్వార్ తన భర్త రాజ్‌వీర్ తో కలిసి శనివారం రాత్రి కాన్పూర్ సెంట్రల్ స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు ప్లాట్‌ఫారమ్ నుంచి అప్పటికే బయలుదేరిన ట్రైన్‌ను అందుకోవడానికి మహిమ ప్రయత్నించింది. హడావిడిలో అదుపు తప్పిన ఆమె ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య జారి పడిపోయింది. ఆందోళన చెందిన ఆమె భర్త, ప్రయాణికులు కేకలు వేశారు. దీంతో ఆ రైలు వెంటనే ఆగిపోయింది.

మరోవైపు ఆర్పీఎఫ్‌ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకున్నారు. ప్లాట్‌ఫారమ్, రైలు పట్టాల మధ్య పడిన ఆ మహిళకు ధైర్యం చెప్పారు. రైలు పట్టాల అవతల వైపుకు వెళ్లారు. భర్త సహాయంతో ఆమెను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన ఆ మహిళకు ప్రథమ చికిత్స అందించారు. డాక్టరైన ఆమె కొడుకుకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్నాడు. తదుపరి చికిత్స కోసం తల్లిని తన వెంట తీసుకుని వెళ్లాడు. కాగా, రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో నమోదైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియో చూడండి:

Leave a Comment