Pawan Kalyan Criticism: పవన్ ప్రత్యర్థులకు ఇక్కడే చిక్కాడు

Pawan Kalyan Criticism: రాజకీయంగా కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా హామీలు ఇవ్వడంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. ఈ విషయంలో ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan) బాధితుడే. ప్రత్యర్ధులపై విరుచుకు పడడంలో, ప్రజల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంలో పవన్ కళ్యాణ్ ముందుంటారు. ఈ విషయంలో ఆయనను తప్పు పట్టలేం కూడా. అయితే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఓ రెండు హామీలు.. ఇప్పుడు మెడకు చుట్టుకుంటున్నాయి. ప్రత్యర్ధులకు వరంగా మారుతున్నాయి. పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించేందుకు కారణం అవుతున్నాయి.

Also Read: చంద్రబాబు, పవన్ మధ్య ప్రకాష్ రాజ్ చిచ్చు!

సుగాలి ప్రీతి కేసు..
నెల్లూరు జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి( sugali Preeti ) దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఇంతవరకు నిగ్గు తేలలేదు. అప్పటి టిడిపి ప్రభుత్వం, తరువాత వచ్చిన వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. అదే విషయాన్ని బాధిత కుటుంబం కూడా పలుమార్లు చెప్పుకొచ్చింది. వైసిపి హయాంలో అయితే పవన్ కళ్యాణ్ ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. ఆర్థిక సాయం చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దీనిపై ఆవేదనతో ఉంది సుగాలి కుటుంబం. పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు కూడా చేస్తోంది. ఆ కుటుంబం ఇప్పటివరకు ఎనిమిది సార్లు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ లభించలేదన్న విమర్శ ఉంది.

సిపిఎస్ కు పరిష్కారం ఏది?
మరోవైపు ఉపాధ్యాయులకు పవన్ కళ్యాణ్ సిపిఎస్( contributary pension scheme) రద్దు పై హామీ ఇచ్చారు. కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దుచేసి.. పాత పెన్షన్ స్కీం పునరుద్ధరిస్తామని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి సైతం సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని.. దానికి ఒక పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. ఆ హామీపై పవన్ దృష్టి పెట్టకపోవడం పై ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ఒక రకమైన ఆగ్రహం ఉంది.

Also Read: నేటి నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు.. కేవలం ఆ జిల్లాల వారికే!

చాలా రకాల హామీలు అమలు..
పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చాలా రకాల హామీలు ఇచ్చారు. ప్రాధాన్యతా క్రమంలో వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. కొన్నింటికి పరిష్కార మార్గం చూపించగలరు. వైసిపి హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుంటే ఏం చేస్తున్నారు అంటూ తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్లో 32 విభాగాలకు సంబంధించి ప్రైవేటీకరణకు యాజమాన్యం సిద్ధపడింది. కానీ దానిపై మారు మాట్లాడడం లేదు పవన్ కళ్యాణ్. అయితే అదే స్థాయిలో పవన్ ఇచ్చిన హామీలు చాలా వరకు అమలు అయ్యాయి. కానీ కొద్దిపాటి హామీలు అలానే ఉండిపోవడం పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా వాడుకుంటుంది. దీనిని పవన్ ఎలా అధిగమిస్తారో చూడాలి.

Leave a Comment