Congress MP: రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది

Congress MP: రాజగోపాల్ రెడ్డి విషయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుంది

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ ఎంపీలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఉన్న విలువ కూడా తెలంగాణ బీజేపీ ఎంపీలకు లేదని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఎంపీలంతా ఆందోళన చేస్తేనే యూరియా వచ్చిందని అన్నారు. బీజేపీ నేతలు ఢిల్లీకి వెళ్లి తెలంగాణకు ఏం ఇవ్వకండి అని చెబుతున్నారు.. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు అని మండిపడ్డారు. మరోవైపు అన్నీ తెలిసి కూడా కేటీఆర్(KTR) అమాయకుడిలా బిహేవ్ చేస్తు్న్నాడని సీరియస్ అయ్యారు. ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వంపై బురదజల్లకపోతే కేటీఆర్‌కు పూటగడవడం లేదని అన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని బీఆర్‌ఎస్‌, బీజేపీ చెప్పాలని సవాల్ చేశారు. కేటీఆర్‌ ప్రెస్‌మీట్లు మూడు షోల లెక్క సాగుతున్నాయని సెటైర్ వేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Raj Gopal Reddy) మంత్రి పదవి అంశం తన పరధిలోనిది కాదని అన్నారు. సరైన సమయంలో అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. సీఎం రేవంత్‌ని తట్టుకునే పరిస్థితి కేటీఆర్‌కు లేదని అన్నారు.

Leave a Comment