లగేజ్ తో రైలులో ప్రయాణం చేస్తున్నారా?

లగేజ్ తో రైలులో ప్రయాణం చేస్తున్నారా?

Train travel luggage rules: ప్రతిరోజు ట్రైన్ జర్నీ చేసేవారు చాలామంది ఉంటారు. కొన్ని రూట్లో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేనప్పుడు ఎక్కువ శాతం ఇందులోనే ప్రయాణిస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు వెళ్లాలంటే రైలులో ప్రయాణం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అయితే రైలు ప్రయాణం అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా.. కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రైలులో ప్రయాణం చేయాలనుకునే వారు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే జరిమాణాలు కట్టాల్సి వస్తుంది. తాజాగా రైల్వే బోర్డ్ కొత్త నిబంధనను తీసుకురాబోతుంది.. అదే లగేజ్ చార్జెస్. ఇప్పటివరకు రైలులో ప్రయాణించేవారు ఎంత బరువు ఉన్న లగేజ్ ని తీసుకు వెళ్లడానికి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఈ లగేజ్ వెయిట్ పై లిమిట్ చేయబోతుంది. మరి ఎంత లిమిట్ లగేజ్ తో రైలులో ప్రయాణం చేయాలి? అసలు ఏంటి నిబంధన?

ఫ్లైట్ జర్నీ చేసే వారికి లగేజ్ వెయిట్ గురించి తెలిసే ఉంటుంది. ఎందుకంటే వారు విమానం ఎక్కేముందు తమ లగేజ్ ని చెక్ చేస్తారు. లగేజ్ బరువు లిమిట్ కంటే ఎక్కువగా ఉంటే దానికి ఆధారంగా చార్జీలు వేస్తారు. దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు ముందే లగేజ్ బరువులు చెక్ చేసుకుని ప్రయాణం చేస్తారు. అయితే ఇప్పుడు ఈ నిబంధన రైల్వేలో కూడా రానుంది. ఇకనుంచి రైల్వే ప్రయాణికులు తమ లగేజ్ ని లిమిట్తో తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటిలో AC first class లో ప్రయాణం చేసేవారు లగేజ్ 70 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు. AC second class or 2 tired లో ప్రయాణం చేసేవారు 50 కిలోల వరకు వస్తువులు తీసుకెళ్లడానికి అవకాశం ఉంటుంది. AC 3 tired class లో ప్రయాణం చేసేవారు 40 కిలోల లగేజ్ కి అవకాశం ఉంటుంది. Slipper class ప్రయాణికులు 40 కిలోల వరకు వస్తువులను తీసుకెళ్లవచ్చు. Second class or General భోగిల్లో ప్రయాణం చేసేవారు 35 కిలోల వరకు బరువులు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Also Read: ఇలాంటి వాకింగ్ చేస్తే మీకే ఆరోగ్య సమస్యలు రావు

అయితే ప్రయాణం చేసే ముందే ఈ బరువును చెక్ చేస్తారు. ఒకవేళ తప్పనిసరిగా నిర్ణీత బరువు కంటే ఎక్కువగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటే అందుకు అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ముందే లగేజ్ వెయిట్ గురించి ఐడియా ఉంటే ప్యాసింజర్ టికెట్ తో పాటు లగేజ్ టికెట్ కూడా తీసుకోవడం ఎంతో మంచిది. అయితే లగేజ్ కి సంబంధించి ఎలాంటి టికెట్ తీసుకోకుండా.. రైలులో ప్రయాణం చేసిన సమయంలో.. ఒకవేళ రైల్వే అధికారులు తనిఖీ చేయగా పట్టుపడితే.. ట్రైన్ టికెట్కు ఆరు రెట్ల ఎక్కువ పెనాల్టీ విధిస్తారు. ఉదాహరణకు ట్రైన్ టికెట్ 200 ఉంటే.. 1200 పెనాల్టీని విధిస్తారు. అందువల్ల లగేజ్ విషయంలో ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ నిబంధనలు ఎప్పటినుంచి అనేది త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. ముందుగా దీనిని కొన్ని నగరాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దేశమంతా ఈ నిబంధనను అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

[

Leave a Comment