యూపిలో ట్రాక్టర్‌ని ఢీకొన్న కంటైనర్.. 8 మంది మృతి

– Advertisement –

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బులంద్‌షహర్ (Uttarpradesh Bulandshahr) పిఎస్ పరిధిలోని జాతీయ రహదారిపై ఘటాల్ గ్రామ సమీపంలో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను కంటైనర్ ట్రక్‌ ఢీకొట్టింది. తెల్లవారుజామున 2.10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో 61 మంది భక్తులు ఉన్నారు. భక్తులతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్‌ని కంటైనర్ వెనుక నుంచి ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది భక్తులు మృతి చెందగా.. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో బోల్తా పడిన ట్రాక్టర్‌ను క్రేన్ సాయంతో సంఘటన జరిగిన స్థలం నుంచి తొలిగించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : బిసి బిల్లు విషయాన్ని పరిశీలిస్తా: అమిత్ షా

– Advertisement –

Leave a Comment