మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టేనా..?- OkTelugu

Mask Man Entry Bigg Boss 9: గత ఎనిమిది సీజన్లుగా బిగ్ బాస్ షో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరిస్తోంది. అయితే బిగ్ బాస్ షో మీద కొంత వరకు నెగెటివిటీ అయితే పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యులను సైతం భాగం చేయాలనే ఉద్దేశ్యంతో బిగ్ బాస్ యాజమాన్యం ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకుంది. ఇక అందులో భాగంగానే కొన్ని టాస్క్ లను సైతం నిర్వహిస్తోంది. ఎవరైతే వాటిని సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేయగలరో ఎవరికైతే బిగ్ బాస్ ట్రోఫీ గెలవగలిగే సత్తా ఉందని ఫీలవుతున్నారో వాళ్ళని మాత్రమే ఉంచుకొని వాళ్ల చేత టాస్కులను చేయించి బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అగ్నిపరీక్ష అనే ఒక షోను కూడా కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇందులో మాస్క్ మాన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న హరీష్ రీసెంట్ గా ఒక పెద్ద టాస్క్ ని అయితే సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడనే చెప్పాలి… అతన్ని స్టేజ్ మీదకి పిలిచి జడ్జెస్ అతనికి ఒక టాస్క్ అయితే విధించారు. అదేంటి అంటే ఒక ట్రిమ్మార్ పక్కనే పెట్టి ఒక ఆఫ్ భాగం గడ్డం మీసాలు తల వెంట్రుకలు మొత్తం కట్ చేసుకొవాలి దానికి మీరు సిద్ధమేనా అని అనగానే మాస్క్ మ్యాన్ వెంటనే ట్రిమ్మార్ తీసుకొని తన జుట్టు ఒక సైడ్ అయితే కత్తిరించుకున్నాడు.

Also Read:  అగ్ని పరీక్ష లో జడ్జెస్ ఎందుకు ఆ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేస్తున్నారు…

ఇక తనకి గడ్డం మీసాలు లేవు కాబట్టి వాటిని వదిలేశాడు. మొత్తానికి అయితే ఇది చూసిన జనాలు, జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ మినిట్ లో జడ్జెస్ ఆ టాస్క్ వద్దు అని చెప్పే ప్రయత్నం చేసేలోపే ఆయన ఆ టాస్క్ మొత్తం ఫినిష్ చేశాడు. బిగ్ బాస్ కోసం తను ఏదైనా చేస్తానని చెప్పడం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

మరి ఈ దెబ్బతో మాస్క్ మ్యాన్ చాలా వరకు మార్కులు అయితే కొట్టేశాడు. దాంతోపాటుగా జనాలు సైతం అతన్ని ఓన్ చేసుకున్నారు. దానివల్ల అతనికి ఎక్కువగా జనాలు నుంచి సపోర్ట్ అయితే లభిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

Also Read: బిగ్ బాస్ లోకి ఆర్మీ పవన్ కళ్యాణ్.. ఏదో జరిగేటట్టే ఉందే?

ఇక ఈ దెబ్బతో మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్ లోకి సెలక్ట్ అయినట్టే అని చాలామంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు… మరి 45 మందిలో నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఆ ఐదుగురు ఎవరు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

Leave a Comment