నాలుగు కెమెరాలు, ఇన్ బిల్డ్ సిమ్.. అదిరిపోయే ఫీచర్స్‌తో ఐఫోన్ ఫోల్డ్!

నాలుగు కెమెరాలు, ఇన్ బిల్డ్ సిమ్.. అదిరిపోయే ఫీచర్స్‌తో ఐఫోన్ ఫోల్డ్!

దిశ‌, వెబ్ డెస్క్: ఈ మ‌ధ్య మ‌ళ్లీ ఫోల్డ్ మొబైల్స్ క‌నిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ రాక‌ముందే ఫోల్డ్ ట‌చ్ ఫోన్లు, నార్మ‌ల్ ఫోన్లు మార్కెట్లోకి రాగా గ్యాడ్జెట్ ల‌వ‌ర్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు డిస్ ప్లే సైతం ఫోల్డ్ అయ్యే మొబైల్స్ రావడంతో కాస్త ట్రెండీగా ఉండాలనుకునేవారు వాటిని కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే సామ్ సంగ్‌లో ఫోల్డ్ మొబైల్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్‌లో మరికొన్ని బ్రాండ్స్‌లో కూడా ఉన్నాయి.

ఇక ఇప్పుడు చాలా మంది గ్యాడ్జెట్ లవర్స్ ఫేవరెట్ అయిన ఆపిల్‌లోనూ ఫోల్డ్ మొబైల్ రాబోతుంది. దీనికి సంబంధించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ నెట్టింట మాత్రం జోరుగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ఐఫోన్ ఫోల్డ్ నాలుగు కెమెరాల ప్రైమరీ కెమెరాతో రాబోతుందట. అదే విధంగా ఈ ఫోన్‌కు ఐపాడ్ మినీ మాధిరిగా టచ్ ప్యాడ్ ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా ఈ మొబైల్ ఆపిల్ సెకండ్ జనరేషన్ సీ2 మోడమ్‌తో రన్ అవ్వబోతుందట.

అంతే కాకుండా ఇందులో సిమ్ కార్డ్ ఇన్ బిల్ట్ గా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇది ఐఫోన్ ఫోల్డ్ బుక్ లాంటి డిజైన్ తో పాటు 7.8 అంగుళాల డిస్ ప్లే మరియు 5.5 అంగుళాల బయటి డిస్ ప్లేతో రాబోతుందట. ఇందులో లేజర్ డ్రిల్డ్ మెటల్ డిస్ ప్లే కూడా ఉండబోతున్నట్టు సమాచారం. అంతే కాకుండా మొదట మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో మాత్రమే ఈ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ధర విషయానికి వస్తే రూ.2 లక్షలుగా ఉండనుంది అనే ప్రచారం జరుగుతోంది.

Leave a Comment